AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan vs Namibia : సాహిబ్‌జాదా ఫర్హాన్ ఊచకోత..102 పరుగుల విజయంతో పాక్ సూపర్ 8లోకి ఎంట్రీ

Pakistan vs Namibia : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నమీబియాపై 102 పరుగుల భారీ విజయంతో ఘనంగా సూపర్‌-8 రౌండ్‌లోకి దూసుకెళ్లింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో పాక్ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి పసికూనను మట్టికరిపించారు.

Pakistan vs Namibia : సాహిబ్‌జాదా ఫర్హాన్ ఊచకోత..102 పరుగుల విజయంతో పాక్ సూపర్ 8లోకి ఎంట్రీ
Pakistan
Rakesh
|

Updated on: Feb 18, 2026 | 6:28 PM

Share

Pakistan vs Namibia : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నమీబియాపై 102 పరుగుల భారీ విజయంతో ఘనంగా సూపర్‌-8 రౌండ్‌లోకి దూసుకెళ్లింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో పాక్ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి పసికూనను మట్టికరిపించారు. ఈ గెలుపుతో ఈ మెగా టోర్నీలో సూపర్‌-8కు చేరిన ఎనిమిదో, ఆఖరి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఇప్పటికే భారత్, జింబాబ్వే సహా ఏడు జట్లు తదుపరి రౌండ్‌కు చేరుకోగా, ఇప్పుడు పాక్ కూడా ఆ జాబితాలో చేరింది.

ఈ మ్యాచ్‌లో పాక్ విజయంలో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హీరోగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డ ఫర్హాన్.. కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. అతనికి తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆగా 38 పరుగులతో రాణించగా, ఆఖర్లో షాదాబ్ ఖాన్ కేవలం 22 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆది నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చిన నమీబియా జట్టు ఏ దశలోనూ పాక్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. పాక్ బౌలర్ల ధాటికి నమీబియా కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 102 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని టోర్నీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ విజయంతో పాక్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

పాకిస్థాన్ సూపర్‌-8కు క్వాలిఫై అవ్వడంతో ఇప్పుడు మరోసారి భారత్ – పాక్ హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్, ఇప్పుడు సూపర్‌-8లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నెగ్గుకు రావడంతో టోర్నీలో అసలు సిసలు మజా మొదలైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.