Rashmika Mandanna: అలాంటి వాళ్లంటే నాకు అసహ్యం.. ‘యానిమల్’ మూవీ ట్రోల్స్ పై రష్మిక రియాక్షన్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓ సన్నివేశం రష్మిక బాగా చేయలేదంటూ తీవ్రస్తాయిలో విమర్శలు వచ్చాయి. మూవీలోని కర్వాచౌత్ సన్నివేశంలో రష్మిక ఓచోట డైలాగ్ సరిగ్గా చెప్పలేదని కొందరు విమర్శించారు.

Rashmika Mandanna: అలాంటి వాళ్లంటే నాకు అసహ్యం.. 'యానిమల్' మూవీ ట్రోల్స్ పై రష్మిక రియాక్షన్..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2024 | 3:13 PM

బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో పాన్ ఇండియా మూవీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రష్మిక.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. గతేడాది యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓ సన్నివేశం రష్మిక బాగా చేయలేదంటూ తీవ్రస్తాయిలో విమర్శలు వచ్చాయి. మూవీలోని కర్వాచౌత్ సన్నివేశంలో రష్మిక ఓచోట డైలాగ్ సరిగ్గా చెప్పలేదని కొందరు విమర్శించారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా ధుపీయాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ ట్రోల్స్ పై స్పందించింది.

“మహిళలను వారి శరీరాకృతిపై ట్రోల్ చేసే వాళ్లంటే నాకు అసహ్యం. అలాంటి వారు కొందరు నా సినిమాలు, అందులో నా నటనపై ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఎలా పనిచేస్తున్నాననో నాకు తెలుసు. ఐదు నెలల క్రితమే ప్రదర్శన ఇచ్చాను. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న కర్వచౌత్ సన్నివేశం చేసిన తర్వాత సెట్ లో ఉన్నవాళ్లందరు చప్పట్లు కొట్టారు. ఆ సన్నివేశం సినిమాకే హైలెట్. ఆ సీన్ కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ ఒక్క సీన్ లోనే ఎన్నో రకాల ఎమోషన్స్ పలికించాలి. అలాంటి కష్టమైన సన్నివేశం పూర్తిచేసిన తర్వాత నా నటన చూసి సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు. అలాగే రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లలో అంతే రెస్పాన్స్ వచ్చింది. కానీ అందరికీ నచ్చిన ఆ సీన్ పై కొందరు మాత్రమే విమర్శించారు. దాదాపు 9 నిమిషాల సీన్ అయితే 10 సెకండ్ల డైలాగ్ బాలేదని ట్రోల్ చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే నేను గిరిగీసుకోని ఒక దగ్గర ఉండాలని అనుకోవడం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది. అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు కదా” అంటూ చెప్పుకొచ్చారు.

యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించింది రష్మిక. ఈ మూవీలో ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే డైరెక్టస్ సందీప్ వంగా కూడా రష్మిక నటనపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. కర్వచౌత్ సన్నివేశంలో చాలా హావభావాలు పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం, ఇలాంటివన్నీ చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఈరోజు రష్మిక బర్త్ డే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..