Meera Jasmine: తొలిసారి ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన మీరా జాస్మిన్.. తండ్రి మరణంపై ఎమోషనల్ పోస్ట్..
కొన్ని రోజులు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంపై హీరోయిన్ మీరా జాస్మిన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తండ్రి ఫోటోస్ షేర్ చేస్తూ.. మళ్లీ కలిసే వరకు ఇంతే అనంతమైన ప్రేమతో అంటూ భావోద్వేగానికి గురైంది. అలాగే తొలిసారి తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది.
సౌత్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఏప్రిల్ 4న) ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. కొన్ని రోజులు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంపై హీరోయిన్ మీరా జాస్మిన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తండ్రి ఫోటోస్ షేర్ చేస్తూ.. మళ్లీ కలిసే వరకు ఇంతే అనంతమైన ప్రేమతో అంటూ భావోద్వేగానికి గురైంది. అలాగే తొలిసారి తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది. “మా నాన్నగారు జోసెఫ్ ఫిలిఫ్ (83) సన్ ఆఫ్ స్వర్గీయ ఫిలిఫ్ తలయిల్ పుతెన్వీటిల్ ఎలంథూర్లో నివసిస్తుండేవారు. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. తిరువల్ల, కొచ్చి ప్రాంతాల్లో నివసించారు. ఆలేయమ్మ జెసెఫ్ భార్య.. పిల్లలు జియోమన్, జెనీ సూసన్, సారా రోబిన్, మీరా జాస్మిన్, జార్జ్, మనవళ్లు, మరదళ్లు, తమ్ముళ్లు ఇలా అందరితో ఎంతో సంతోషంగా జీవించారు. శనివారం ఆయన బాడీ మా వద్దకు వస్తుంది. ఆయన ఆత్మ శాంతి కోసం మాతోపాటు ప్రార్థనలు చేయండి. మధ్యాహ్నం నుంచి ప్రేయర్స్ జరుగుతాయి. ఆదివారం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి ” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.
ఒకప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మీరా జాస్మిన్.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కొన్నాళ్లపాటు ఫ్యామిలీతో గడిపిన మీరా.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తెలుగులో విమానం సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది. దాదాపు రెండేళ్లపాటు సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్న మీరా.. ఎప్పుడూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకోలేదు. అలాగే తన కుటుంబసభ్యులకు సంబంధించిన ఫోటోస్ అభిమానులతో పంచుకోలేదు. కానీ మొదటిసారి తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది మీరా.
మీరా జాస్మిన్ 2001లో సూత్రధారన్ సినిమాతో నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గుడుంబా శంకర్ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. అంతకు ముందు కోలీవుడ్ హీరో విశాల్ జోడిగా పందెం కోడి సినిమాలో కనిపించింది. ఈ రెండు చిత్రాలు మీరా జాస్మిన్ సినీ కెరీర్ లో గుర్తింపు తెచ్చాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.