Tollywood: ఈవారం ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. ఆ 4 మూవీస్ అస్సలు మిస్ కాకండి..
మరోవైపు థియేటర్లలో మాత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ సందడి చేస్తున్నాయి. సరికొత్త కంటెంట్... కామెడీతో నవ్వులు పూయిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్లలో టిల్లు స్క్వేర్ సినిమా దూసుకుపోతుండగా.. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఓటీటీల్లోకి అనేక చిత్రాలు వచ్చాయి. బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఈవారం ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ రిలీజ్ అయ్యాయి.

ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవసరమైతే గానీ బయటకు రావద్దంటూ ఇప్పటికే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు థియేటర్లలో మాత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ సందడి చేస్తున్నాయి. సరికొత్త కంటెంట్… కామెడీతో నవ్వులు పూయిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్లలో టిల్లు స్క్వేర్ సినిమా దూసుకుపోతుండగా.. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఓటీటీల్లోకి అనేక చిత్రాలు వచ్చాయి. బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఈవారం ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ రిలీజ్ అయ్యాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.
చారి 111 వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటించిన చిత్రం చారి 111. మార్చి 1న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రివ్యూ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
కిస్మత్.. అభినవ్, నరేశ్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలలో నటించిన సినిమా కిస్మత్. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ చిత్రానికి రబాదినేని శ్రీనాథ్ దర్శకత్వం వహించారు.
తంత్ర… తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ తంత్ర. డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
హనుమాన్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో వచ్చిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్. ఈ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు తెలుగు, హిందీలో అందుబాటులో ఉండగా..ఇప్పుడు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
లంబసింగి.. బిగ్ బాస్ బ్యూటీ దివి వైధ్య, భరత్ రాజ్ జంటగా నటించిన సినిమా లంబసింగి. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆహా.. మిషన్ చాప్టర్ 1.. తమిళ్..
నెట్ ఫ్లిక్స్..
డోంట్ వాంట్ వర్సీ డార్లిగ్.. ఎల్విన్.. ఇంగ్లీష్.. స్మైల్.. కన్ ఫెస్ ఫ్లెట్చ్ క్రూక్స్.. లెగో నింజాగో.. ఐ వోక్ అప్ వాంంపైర్..
సోనీ లివ్..
ఫ్యామిలీ ఆజ్ కల్.. ది ఉమెన్ కింగ్.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. విష్..
జియో.. బెల్..
అమెజాన్ ప్రైమ్.. జుని..కన్నడ, హౌ టూ డేట్ బిల్లీ వ్లాష్.. మ్యూజికా.. యష్ మేరీ ఫ్యామిలీ..
జీ5 ఫర్రే .. లా వస్తే.. హిందీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



