Rashi Khanna: ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయిన రాశీఖన్నా.. ఏ సినిమా కోసమంటే
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా అందం అభినయంతో ఆకట్టుకుంది. తొలి సినిమాతో ఆకట్టుకున్న రాశీ ఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోల అందరి సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

రాశీ ఖన్నా.. ఈ వయ్యారి భామ ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా అందం అభినయంతో ఆకట్టుకుంది. తొలి సినిమాతో ఆకట్టుకున్న రాశీ ఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోల అందరి సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. రీసెంట్ గా బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది ఈ చిన్నది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది ఈ భామ. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా నటించింది ఈ భామ. జయ లవ కుశ సినిమాలో నటించింది. కెరీర్ ప్రారంభంలో ఈమె ఓ సినిమాకి ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయిందంట ఈ చిన్నది.
మద్రాస్ కేఫ్ అనే సినిమాకు రాశీఖన్నా హీరోయిన్ గా ఆడిషన్స్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో చాలా మంది సెలబ్రిటీల మధ్య ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక.. వాళ్ళందరిని చూసి రాశీఖన్నా పారిపోయిందట. ఆ తర్వాత ఆర్ట్ మీదున్న గౌరవంతో తిరిగి ఆడిషన్ ఇచ్చిందట. దాంతో ఆమె ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యింది.




