Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

Phani CH

|

Updated on: Apr 29, 2023 | 9:29 AM

మ్యాచోస్టార్‌ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

మ్యాచోస్టార్‌ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గోపీచంద్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల.. అనే లైన్ ఉంది. అయితే కరీంనగర్‌కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట తనదే, ట్యూన్ కూడా తనదేనంటూ మీడియాను ఆశ్రయించారు. గొల్లపల్లి రవీందర్‌ ఈ పాటను 1992లో చేతికి గాజులు పిల్లో పాట రాశానని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్‌.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Published on: Apr 29, 2023 09:29 AM