“జ‌గ‌న్ పార్టీపై నేను కామెంట్స్ చెయ్య‌లేదు..వారిపై కేసు పెడ‌తా”

తనకు సామాజిక మాధ్య‌మాల‌కు సంబంధించిన‌ ఎటువంటి ఖాతాలు లేవని ప్రముఖ నటుడు రావు రమేశ్ క్లియ‌ర్ గా చెప్పేశారు. కొందరు వ్యక్తులు ఆయన పేరుపై ఫేక్ ట్విటర్‌ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఖాతా నుంచి ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో అల‌ర్ట‌యిన‌ రావు రమేశ్‌ ప్రకటన రిలీజ్ చేశారు. ‘నన్ను, నా నటనను అభిమానించే ప్రతి వ్య‌క్తికీ.. నాకు సామాజిక మాధ్య‌మాల్లో […]

జ‌గ‌న్ పార్టీపై నేను కామెంట్స్ చెయ్య‌లేదు..వారిపై కేసు పెడ‌తా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 8:11 PM

తనకు సామాజిక మాధ్య‌మాల‌కు సంబంధించిన‌ ఎటువంటి ఖాతాలు లేవని ప్రముఖ నటుడు రావు రమేశ్ క్లియ‌ర్ గా చెప్పేశారు. కొందరు వ్యక్తులు ఆయన పేరుపై ఫేక్ ట్విటర్‌ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఖాతా నుంచి ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో అల‌ర్ట‌యిన‌ రావు రమేశ్‌ ప్రకటన రిలీజ్ చేశారు. ‘నన్ను, నా నటనను అభిమానించే ప్రతి వ్య‌క్తికీ.. నాకు సామాజిక మాధ్య‌మాల్లో ఎటువంటి ఖాతాలు లేవు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా దేన్నీ యూజ్ చెయ్య‌డం లేదు. శనివారం నా పేరు మీద ట్విటర్‌లో కొన్ని పోస్ట్‌లు పెట్టారు. అవి నేను పెట్టిన‌వి కాదు. వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అటువంటి పోస్టుల‌ను నమ్మకండి. నేనేదైనా చెప్పాల‌నుకుంటే వార్తా ప‌త్రిక‌ల ద్వారా తెలియజేస్తా. త్వరలోనే నా పేరు మీద ఇలా తప్పుడు అకౌంట్స్ నడుపుతున్న వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టబోతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

‘యాక్టర్‌ రావు రమేశ్‌’ పేరుతో ట్విటర్‌లో 2020 మేలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఖాతాని ప్రారంభించారు. ఈ అకౌంట్ ను 2,500 మంది ఫాలో అవుతున్నారు. ఇందులో చేసిన పోస్ట్‌లకు చాలామంది కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో రావు రమేశ్ పై విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే… గత ఏడాది దాదాపు 12 తెలుగు మూవీస్ లో కనిపించిన రావు రమేశ్.. ఈ ఏడాది సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’లో సందడి చేశారు. ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాలు లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డాయి.