
సినిమా షూటింగ్స్ లో అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యాక్షన్ సీన్స్ షూట్స్ జరిగేటప్పుడు. లేదా ఏదైనా ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ స్టార్ హీరో సినిమా సెట్ లో ఊహించని సంఘట జరిగింది. దాంతో ఏకంగా 120మందికి పైగా హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఒకే సారి 120కి పైగా హాస్పటల్ లో చేరడం తో గందరగోళం నెలకొంది. ఇంతకూ ఆ సినిమా ఏది.? ఆ స్టార్ హీరో ఎవరు.? అసలు ఏమైందో చూసేద్దాం.!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రణవీర్ సింగ్ ధురంధర్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లడక్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో చిత్రయూనిట్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత సుమారు 120మంది మూవీ టీమ్ అనారోగ్యానికి గురయ్యారు.
వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ శాంపిల్స్ ను ప్రస్తుతం లాబ్ కు పంపించి టెస్ట్ చేస్తున్నారు. ఈ సంఘటన బాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. సినిమా షెడ్యూల్ కోసం హాజరైన 600 మంది సిబ్బందిలో, దాదాపు 120 మంది అస్వస్థతకు గురై ప్రస్తుతం SNM ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.