భల్లాలదేవుడు ఈజ్ బ్యాక్..రానా న్యూ లుక్ అదరహో..
రానా దగ్గుబాటి…ఈయనను స్టార్ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే రానా పాత్రలకు పరిధి పెట్టుకోడు. తన క్యారెక్టర్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకోడు. మంచి ప్రాముఖ్యత ఉంటే చాలు అని భావిస్తాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అవే అతడిని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాషా బేధాలు లేకుండా రాానా ఇప్పుడు అన్ని ఇండష్ట్రీలలో అదరగొడుతున్నాడు. కాగా ఇటీవల రానా ఆరోగ్య పరిస్థితిపపై పలు రకాల రూమర్స్ వచ్చాయి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ […]
రానా దగ్గుబాటి…ఈయనను స్టార్ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే రానా పాత్రలకు పరిధి పెట్టుకోడు. తన క్యారెక్టర్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకోడు. మంచి ప్రాముఖ్యత ఉంటే చాలు అని భావిస్తాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అవే అతడిని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాషా బేధాలు లేకుండా రాానా ఇప్పుడు అన్ని ఇండష్ట్రీలలో అదరగొడుతున్నాడు. కాగా ఇటీవల రానా ఆరోగ్య పరిస్థితిపపై పలు రకాల రూమర్స్ వచ్చాయి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం అతడు విదేశాలకు వెళ్లాడని చాలా చర్చ జరిగింది. అయితే వాటిని దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.
అయితే ఆ సమయంలో బయటకు వచ్చిన రానా లుక్ మాత్రం అందర్నీ షాక్‌కి గురి చేసింది. పూర్తిగా బక్కచిక్కిపోయిన తమ అభిమాన హీరో లుక్ చూసి ఫ్యాన్స్ అయితే తీవ్ర కంగారు పడ్డారు. ఆ తర్వాత నుంచి రానా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో..వెంకీమామ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యడానికి ఓ ప్రొమెషనల్ వీడియో చేశాడు. దాంట్లో రానా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కనిపించాడు. మరీ బాహుబలి టైం ఉన్నంత కాకపోయినా..ప్రజంట్ రానా లుక్ మాత్రం సమ్‌థింగ్ బెటర్ అని చెప్పాలి. పూర్తి హెల్దీ అండ్ ఫిట్‌గా కనిపించడంతో…ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు పలు సౌత్ ఇండియన్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా మన టాలీవుడ్ హంక్ మెస్మరైజ్ చేయనున్నాడు.