‘వెంకీమామ’ రిలీజ్ డ్రామాకు తెర.. రంగంలోకి దిగిన రానా

రియల్ లైఫ్ మేనమామ-మేనల్లుడు వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా ఈ మూవీ విడుదల విషయంలో ఎప్పటినుంచో డైలమా నడుస్తూ వస్తోంది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికే మహేష్, బన్నీల మధ్య కాంపిటేషన్ ఫుల్‌గా ఉండటంతో క్రిస్మస్‌ […]

'వెంకీమామ' రిలీజ్ డ్రామాకు తెర.. రంగంలోకి దిగిన రానా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2019 | 9:42 PM

రియల్ లైఫ్ మేనమామ-మేనల్లుడు వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా ఈ మూవీ విడుదల విషయంలో ఎప్పటినుంచో డైలమా నడుస్తూ వస్తోంది.

మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికే మహేష్, బన్నీల మధ్య కాంపిటేషన్ ఫుల్‌గా ఉండటంతో క్రిస్మస్‌ బరిలో వెంకీమామను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోగా.. వెంకీమామ విడుదల తేదీ డ్రామాను తెరదించేందుకు రానా రంగంలోకి దిగాడు. ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీని ఇచ్చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన నిర్మాతలు.. డిసెంబర్ 13న వెంకీమామ రానుందంటూ చెప్పేశారు. అదే రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం.

కాగా నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు వెంకటేష్. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ సినిమా రానుండటంతో అభిమానుల్లో అంచనాలు చాలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ రైతుగా కనిపించనుండగా.. చైతూ జవాన్‌గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల అవ్వడంతో పాటు.. ప్రీ రిలీజ్ వేడుక కూడా ఉండబోతోంది.