సరిలేరు నీకెవ్వరు:మహేష్ గాత్రం.. మాస్ బీట్‌.. ఫ్యాన్స్‌కు ‘మైండ్ బ్లాక్’

సరిలేరు నీకెవ్వరు:మహేష్ గాత్రం.. మాస్ బీట్‌.. ఫ్యాన్స్‌కు 'మైండ్ బ్లాక్'

సూపర్‌స్టార్ మహేష్ బాబు సోమవారపు ప్రమోషన్లను షురూ చేసేశాడు. మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు నుంచి 5 సోమవారాలు 5 పాటలను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించగా.. అందులో భాగంగా ఇవాళ మొదటి పాట విడుదలైంది. మైండ్‌బ్లాక్ అంటూ ఈ పాటను రెనైనా రెడ్డి, బ్లాజ్‌ ఆలపించారు. శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించారు.  మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటలో మహేష్ గాత్రం కూడా ఉండగా.. అందరినీ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 02, 2019 | 5:34 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు సోమవారపు ప్రమోషన్లను షురూ చేసేశాడు. మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు నుంచి 5 సోమవారాలు 5 పాటలను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించగా.. అందులో భాగంగా ఇవాళ మొదటి పాట విడుదలైంది. మైండ్‌బ్లాక్ అంటూ ఈ పాటను రెనైనా రెడ్డి, బ్లాజ్‌ ఆలపించారు. శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించారు.  మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటలో మహేష్ గాత్రం కూడా ఉండగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

అయితే వచ్చే సంక్రాంతికి మహేష్ బాబుతో అల్లు అర్జున్ పోటీ పడబోతున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న విడుదల కాగా.. బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12న రిలీజ్ అవ్వబోతోంది.(మొదట ఒకేరోజు రెండు సినిమాలను విడుదల చేయాలనుకున్నారు) దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. దానికి తోడు ‘అల వైకుంఠపురంలో’ నుంచి వచ్చిన పాటలు ఓ వైపు యూట్యూబ్‌లో దూసుకుపోతుండటం, ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలు బాలేవంటూ ఇన్నర్ టాక్ వినిపించడంతో మహేష్ ఫ్యాన్స్‌లో ఇన్నిరోజులు కాస్త అసహనం ఉండేది. కానీ ఇప్పుడొచ్చిన పాటతో వారి అనుమానాలు తీరాయి. థియేటర్లలో ఈ పాట అదరగొడుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ పాటలోనే మహేష్ బాబుతో మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా.. ఆయన సరసన రష్మిక కనిపిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu