డార్లింగ్‌తో ‘ధూమ్ 4’.. యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే డీల్!

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. దీనికి నిదర్శనం ‘సాహో’ సినిమా. ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభాస్‌కు నిజంగానే స్టామినా ఉందా అని అందరూ అనుకున్నారు. కానీ సోసోగా ఉన్న కంటెంట్‌తో రిలీజైన ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యి… హిందీలో అద్భుత విజయం సాధించడంతో.. ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి. అందుకే ఇప్పటికీ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతుంటారు. ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌కు […]

డార్లింగ్‌తో 'ధూమ్ 4'.. యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే డీల్!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:27 PM

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. దీనికి నిదర్శనం ‘సాహో’ సినిమా. ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభాస్‌కు నిజంగానే స్టామినా ఉందా అని అందరూ అనుకున్నారు. కానీ సోసోగా ఉన్న కంటెంట్‌తో రిలీజైన ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యి… హిందీలో అద్భుత విజయం సాధించడంతో.. ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి. అందుకే ఇప్పటికీ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతుంటారు.

‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌కు బీ-టౌన్ నుంచి అద్భుతమైన ఆఫర్స్ తలుపు తట్టాయి. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖ నిర్మాతలు అదిరిపోయే డీల్స్‌ను డార్లింగ్ ముందు ఉంచినా.. అన్నింటికీ నో చెప్పాడు. ఇక ఆ ఆఫర్స్‌లో ఒకటి ‘ధూమ్ 4’. ప్రభాస్ లాంటి కటౌట్.. ఇలాంటి యాక్షన్ సినిమాలో ఉంటే.. బొమ్మ అదుర్స్ అని వారు భావించారు. కానీ అప్పట్లో ప్రభాస్ వీటన్నింటిని వదులుకున్నాడు.  అయితే రీసెంట్‌గా ‘వార్’ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో.. ఆదిత్య చోప్రా మరోసారి ప్రభాస్‌ను ఈ విషయమై సంప్రదింపులు జరిపారట. కుదిరితే ‘వార్’ సీక్వెల్‌లో లేదా ‘ధూమ్ 4’లో నటించాలని ప్రభాస్‌ను  కోరినట్లు తెలుస్తోంది.

రెండు సినిమాల్లో దేనికి ఓకే చెప్పినా.. ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాక ‘ధూమ్ 4’ విషయంలో అయితే.. డార్లింగ్ విలన్ రోల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లో హీరో కంటే.. విలన్‌కే ఎక్కువ ప్రాముఖ్యత. మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండో భాగంలో హృతిక్ రోషన్.. మూడో భాగంలో అమీర్ ఖాన్.. విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్లే.. ఈ క్రమంలో ప్రభాస్ ‘ధూమ్ 4’కు ఓకే చెబితే.. సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. మరి డార్లింగ్ ఒప్పుకుంటాడో.. లేదో చూడాలి.