ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. ఇకపై సరుకులు ఎక్కడ నుంచైనా…

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి వినూత్న నిర్ణయాలతో దేశ అభివృద్దే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు మాదిరిగా ప్రధాని మోదీ నుంచి వచ్చిన మరో గొప్ప ఆలోచన ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’.. ఇక ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం ఏంటి.? దీనిని ఎలా అమలు చేస్తారు.? విధివిధానాలు ఏంటనేది స్వయంగా కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ […]

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. ఇకపై సరుకులు ఎక్కడ నుంచైనా...
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 04, 2019 | 1:26 PM

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి వినూత్న నిర్ణయాలతో దేశ అభివృద్దే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు మాదిరిగా ప్రధాని మోదీ నుంచి వచ్చిన మరో గొప్ప ఆలోచన ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’.. ఇక ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం ఏంటి.? దీనిని ఎలా అమలు చేస్తారు.? విధివిధానాలు ఏంటనేది స్వయంగా కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాటల్లోనే తెలుసుకుందాం..

ఒకే దేశం.. ఒకటే రేషన్ కార్డు.. స్కీమ్ అంటే ఏమిటీ..?

రామ్ విలాస్ పాశ్వాన్: ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే..  జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద రేషన్ కార్డు కలిగిన వాళ్లందరూ దేశంలోని ఏ రేషన్ షాప్ నుంచైనా సబ్సిడీ ద్వారా నిత్యావసర వస్తువులను తీసుకోవచ్చు. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల రేషన్ కార్డు వినియోగదారులు తమకు నిర్దేశించిన రేషన్ షాపుల నుంచే సబ్సిడీ సామాగ్రిని పొందవలసి ఉంది. ఇక ఇప్పుడు ప్రతిపాదించిన విధానం వల్ల వినియోగదారుడు తమ సొంత ఊరు నుంచి.. వేరే ప్రదేశానికి వెళ్లినా.. అక్కడి రేషన్ షాప్ ద్వారా ఆహార ధాన్యాలను సులభంగా పొందవచ్చు. ఇక ఈ సదుపాయం ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో ప్రారంభమైంది.

ఈ పథకం ఎప్పుడు అమలవుతుంది..?

రామ్ విలాస్ పాశ్వాన్: జూన్ 1, 2020 నుంచి దీన్ని అమలు చేస్తాం.

ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ సిద్ధంగా ఉందా.?

రామ్ విలాస్ పాశ్వాన్: ఎన్డీయే ప్రభుత్వం 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అన్ని రేషన్ కార్డులను డిజిటలైజేషన్ చేసింది. అంతేకాకుండా రేషన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం కూడా చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులు మాత్రమే రేషన్ పొందేలా.. నకిలీ కార్డులను తొలగించడం జరిగింది. ఇక ఈ విధానం వల్ల దేశం మొత్తం మీద 81 కోట్ల లబ్ధిదారుల నుంచి సుమారు 15 కోట్ల నకిలీ లబ్దిదారులను తొలగించాం. కాగా, ఇప్పటివరకు 89 శాతం రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం ఉంది.

ప్రస్తుతం ఉన్న లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను ఇస్తారా.?

రామ్ విలాస్ పాశ్వాన్: లేదు. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామనేది వట్టి రూమర్లు మాత్రమే. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రేషన్ కార్డుతోనే వినియోగదారులు దేశం మొత్తం మీద ఏ రేషన్ షాప్ నుంచి అయినా సబ్సిడీకి నిత్యావసర వస్తువులను పొందవచ్చు.

ఈ పథకం వల్ల ఎవరు ఎక్కువగా లాభపడతారు..?

రామ్ విలాస్ పాశ్వాన్: దీని వల్ల అందరికి లాభం చేకూరుతుంది. ముఖ్యంగా పేదవాళ్లకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. దీనికి ఉదాహరణ కూడా ఉంది. ఒక వ్యక్తి పని నిమిత్తం.. హర్యానా నుంచి పంజాబ్ వెళ్తే.. తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను పొందే అవకాశాన్ని కోల్పోనవసరం లేదు. అక్కడ కూడా పొందవచ్చు. అలాంటి పేదవాళ్లు… కేవలం ఒక్క రేషన్ షాప్‌కు మాత్రమే పరిమితం కానక్కర్లేదు.

రామ్ విలాస్ పాశ్వాన్: అలాంటిది ఏమి లేదు. దీన్ని అమలు పరిస్తే.. ఆర్ధికంగా ఎటువంటి భారం ఉండదు.. అంతేకాకుండా లోపాలను కూడా సరి చేస్తుంది.

ప్రజల గోప్యతకు మీరు ఎలాంటి భరోసాను ఇస్తారు..?

రామ్ విలాస్ పాశ్వాన్: ఈ పథకం వల్ల ఎవరి వివరాలు బయటికి రావు. ఇంకా చెప్పాలంటే.. ఈ విధానం అందరికి ఉపయోగపడుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రేషన్ షాప్‌లోనైనా వాళ్ళు సబ్సీడీ వస్తువులు పొందవచ్చు.