ఇకపై జనరల్ టిక్కెట్లకు .. సీట్లు కన్ఫర్మ్..!

రైళ్లలో చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో కంటే.. జనరల్‌ కంపార్ట్మెంట్లలోనే తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. సీట్లు దొరక్కపోయినా.. రష్‌గా ఉన్నా కూడా ఇబ్బంది పడుతూనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇక అలా తరచూ జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై జనరల్ టిక్కెట్లతోనూ రిజర్వేషన్ సీట్లు పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం జనరల్ బోగీల్లో సీట్లు దక్కించుకోవాలంటే.. ట్రైన్ మొదలయ్యే స్టేషన్‌కు గంట ముందుగానే చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బెడద లేకుండా […]

ఇకపై జనరల్ టిక్కెట్లకు .. సీట్లు కన్ఫర్మ్..!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:46 PM

రైళ్లలో చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో కంటే.. జనరల్‌ కంపార్ట్మెంట్లలోనే తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. సీట్లు దొరక్కపోయినా.. రష్‌గా ఉన్నా కూడా ఇబ్బంది పడుతూనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇక అలా తరచూ జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై జనరల్ టిక్కెట్లతోనూ రిజర్వేషన్ సీట్లు పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం జనరల్ బోగీల్లో సీట్లు దక్కించుకోవాలంటే.. ట్రైన్ మొదలయ్యే స్టేషన్‌కు గంట ముందుగానే చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బెడద లేకుండా త్వరలో రైల్వే శాఖ ప్రవేశపెట్టే ఈ కొత్త విధానం ద్వారా జనరల్ టిక్కెట్లు తీసుకున్నవారికి కూడా సీట్లు కన్ఫర్మ్ కానున్నాయి.

ఈ టిక్కెట్లు పొందాలంటే.. రైల్వే కౌంటర్లలో ప్రయాణీకుడు తన ఐడీ కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఐడీ కార్డు ద్వారా మీ ఫోటోను తీస్తారు. ఇక ఆ ఫొటోతో కూడిన డిజిటల్ టికెట్‌ను ప్రయాణీకుడు వాట్సాప్ నంబర్‌కు పంపుతారు. దీంతో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో వారికి కేటాయించిన సీట్లలో ఇంచక్కా కూర్చోవచ్చు. ‘పాస్ ఫర్ అన్‌రివార్డెడ్ బోర్డ్-పియుఆర్‌బి’ అనే పేరుతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం దానాపూర్ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం గనక సక్సెస్ అయితే.. దేశమంతా దీనిని విస్తరించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సదుపాయం వస్తే.. ప్రజలు ఇకపై జనరల్ బోగీల్లో కూడా ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని సాగించవచ్చు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!