‘హిరణ్యకశ్యప’పై బడా నిర్మాణ సంస్థ కళ్లు..!
రానా దగ్గుబాటి నటుడిగా తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. అతని వినూత్న స్క్రిప్ట్స్ ఎంపిక యువ నటులను ఆశ్చర్యపరుస్తుంది. 'బాహుబలి'తో పాన్ ఇండియన్ నటుడిగా మారారు రానా .

రానా దగ్గుబాటి నటుడిగా తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. అతని వినూత్న స్క్రిప్ట్స్ ఎంపిక యువ నటులను ఆశ్చర్యపరుస్తుంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియన్ నటుడిగా మారారు రానా . కాగా ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో ‘హిరణ్యకశ్యప’పై దృష్టి సారించారు. గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం ఇప్పటి వరకు రూ .15 కోట్లు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చాలా వర్క్ యూఎస్ లో జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే హైప్ పెరిగింది. టాప్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్..ఈ క్రేజీ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరించాలని ఉవ్వీలూరుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తయినట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ‘హిరణ్యకశ్యప’ను నిర్మించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ కోసం రానా మేక్ఓవర్‌తో రాబోతున్నాడు. ఇప్పటికే అనేక మంది హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటన చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.




