
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆర్జీవీ తన సినిమాలతో యూత్ ను తెగ ఆకట్టుకున్నాడు. ఆర్జీవీ సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఒకప్పుడు ఆర్జీవీ సినిమాలకు ఇండస్ట్రీని ఊపేశాయి. కానీ ఇప్పుడు ఆయన ట్రాక్ మార్చి సినిమాలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే కొన్ని బోల్డ్ సినిమాలను కూడా తెరకెక్కించిఆకట్టుకుంటున్నారు. శివ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆర్జీవీ.. మళ్లీ అలాంటి సినిమా చేసి మెప్పించాలని ఆర్జీవీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఆర్జీవీ 63వ పడిలోకి అడుగుపెట్టారు.
ఏప్రిల్ 7న ఆర్జీవీ 63వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీవీ తాజా లుక్ అభిమానులకు షాక్ ఇస్తుంది. అప్పుడు ఫుల్ ఎనర్జీతో , స్టైలిష్ లుక్ లో కనిపించే ఆర్జీవీ.. తాజాగా షాకింగ్ లుక్ లో కనిపించారు. ఫిట్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ.. బక్క చిక్కిపోయి కనిపించారు. దాంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆర్జీవీ ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారా.? లేక ఏదైనా హెల్త్ ఇష్యుస్ ఉన్నాయా.? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ లుక్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఏప్రిల్ 7న ఆర్జీవీ పుట్టిన రోజున పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. మరో వైపు ఆర్జీవీ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ఎక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.