Ram Gopal Varma: వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు.. క్రిమినల్‌ కేసు పెట్టాలంటోన్న ఆర్జీవీ

వారాహి రెండో విడత యాత్రలో భాగంగా ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడి వాలంటీర్లపై పవన్‌ చేసిన ఆరోపణలు హాట్‌ టాపిక్‌గా మారాయి. వాలంటీర్లు ప్రతి గ్రామంలో..

Ram Gopal Varma: వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు.. క్రిమినల్‌ కేసు పెట్టాలంటోన్న ఆర్జీవీ
Rgv, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 10, 2023 | 7:09 AM

వారాహి రెండో విడత యాత్రలో భాగంగా ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడి వాలంటీర్లపై పవన్‌ చేసిన ఆరోపణలు హాట్‌ టాపిక్‌గా మారాయి. వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి? ఏ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు?  అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా? వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని జనసేన అధ్యక్షులు ఆరోపించారు. అంతేక కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తోన్న ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజలకు సేవలు చేస్తోన్న వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేసిన పవన్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా వరుసగా పోస్టులు షేర్‌ చేశారు వర్మ.

ఫ్యామిలీకి మొహాలెలా చూపిస్తారు?

‘వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది అనే పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ ఎవరి మీద చేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ల దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా పవన్‌ చెవిలో ఎందుకు చెప్పారు? ప్రజల కోసం పని చేసే వైసీపీ వాలంటీర్లని పవన్‌ కల్యాణ్‌ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్ల కి సిగ్గు , శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్లు పవన్‌ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి . పెట్టకపోతే వాళ్ల ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు ?’

ఇవి కూడా చదవండి

‘వాక్ స్వాతంత్రం ఉన్నది అభిప్రాయాలు చెప్పటానికి , భిన్నాభిప్రాయాలతో డిబేట్ లు ప్రోవొక్ చెయ్యటానికి , కానీ జీరో ఎవిడెన్స్ లేని ఆరోపణలు చెయ్యటానికి కాదు .. 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు ఇది తెలియకపోవడం అతని చదువులేనితనాన్ని నిరూపిస్తోంది.‘ అని ట్విట్టర్‌ వేదికగా సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు ఆర్జీవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..