ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలన్న బీఆర్‌ఎస్ పార్టీ ఆశలు ఆవిరైపోయాయి. ఇవాళ( డిసెంబర్ 3) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో కారు పార్టీ పరాజయం పాలైంది. మొత్తం 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 39 స్థానాల్లోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నూరి పోశారు. అదే సమయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ‘బీఆర్‌ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఫలితాల గురించి నేను బాధ పడడం లేదు. అయితే ఫలితాలు మేము ఆశించిన స్థాయిలో రాలేదు. దీనిపై కాస్త నిరాశగా ఉన్నమాట నిజమే. అయితే మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాము, తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో పరాజయాన్ని కూడా ఎంతో హుందాగా స్వీకరించిన కేటీఆర్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.
మొదట స్టార్ యాంకర్ అనసూయ కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ‘మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. మీ హయాంలో ఎంతో పురోగతి సాధించిన హైదరాబాద్‌తో నేను ప్రేమలో పడ్డాను.. బలమైన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు సార్’ అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అలాగే ప్రముఖ దర్మకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కేటీఆర్ ట్వీట్‌పై రియాక్ట్ అయ్యారు. ‘ఓటమిని ఇంత సానుకూల దృక్పథంతో స్వీకరించిన ఏ రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది’ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. అలాగే మరో హీరో సందీప్ కిషన్ ‘మేము ఇప్పటికీ, ఎప్పటికీ మీ అభిమానులమే అన్నా’ అని కేటీఆర్ ట్వీట్‌కు కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఓటమిని కూడా ఎంతో హుందాగా స్వీకరించిన మంత్రి కేటీఆర్‌కు అందరూ హ్యాట్స్‌ఫ్ చెబుతున్నారు.
You have been a true leader Sir.. inspiring many..may be it was needed that you see the state of our State from the other side.. hoping you would do the needful even with being the strong opposition .. Thank you for making me fall in love with Hyderabad all over again with all…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2023
In fact this will age very well sir ! That’s because I never saw any political leader taking his defeat in such a positive spirit ..KUDOS TO YOU💐💐💐 This is what’s needed for a HEALTHY DEMOCRACY 🙏🙏🙏 https://t.co/Fp00Y8MfKl
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.