Upasana-Thalapathy Vijay : రాజకీయాల్లోకి దళపతి విజయ్‌.. మెగా కోడలు ఉపాసన ఏమన్నారో తెలుసా?

మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్‌ తరఫును చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆమె మహిళలు, సామాజిక సమస్యలపై స్పందింస్తుంటుందామె. ఆయా అంశాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది

Upasana-Thalapathy Vijay : రాజకీయాల్లోకి దళపతి విజయ్‌.. మెగా కోడలు ఉపాసన ఏమన్నారో తెలుసా?
Thalapathy Vijay, Upasana K

Updated on: Feb 08, 2024 | 12:01 PM

మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్‌ తరఫును చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆమె మహిళలు, సామాజిక సమస్యలపై స్పందింస్తుంటుందామె. ఆయా అంశాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభపరిణామమంటూ అందరూ తనకు సపోర్టు చేయాలని కోరింది. ‘ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లోనూ రాణించారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా చేశారు. తన సినిమాలతో ఎంతో మంది మనసులు గెల్చుకున్నారు విజయ్‌దళపతి. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడు ఎవరైనా సపోర్టు చేయాలన్నది నా అభిప్రాయం. ఒక వేళ అలాంటి వాళ్లకు మనం సపోర్టు చేయకపోయినా.. వెనక్కు మాత్రం లాగకూడదు. విజయ్‌ దళపతి ఒక మంచి రాజకీయా నాయకుడు అవుతారని ఆశిస్తున్నా’ అని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇదే సందర్భంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఉపాసన. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలు లేదంది. అసలు అలాంటి అవకాశమే లేదని ఉపాసన స్పష్టం చేసింది.

కోలీవుడ్ లో స్టార్‌ హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్‌ దళపతి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తమిళ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ డీఎంకే నేత, హీరో ఉదయనిధి స్టాలిన్‌ కూడా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీని స్వాగతించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్‌ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తాతపై పుస్తకం ఆవిష్కరణ

చిరంజీవి సన్మాన సభలో ఉపాసన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.