Ram Charan: RC15 అమృత్‌సర్‌ షెడ్యూల్‌ పూర్తి.. ఆచార్య ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌కు చెర్రీ.. నెట్టింట్లో వైరల్‌ ఫొటో..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan). సినిమాలో అతని నటనకు నార్త్‌ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. కాగా త్వరలోనే ఆచార్య (Acharya) సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు చెర్రీ.

Ram Charan: RC15 అమృత్‌సర్‌ షెడ్యూల్‌ పూర్తి.. ఆచార్య ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌కు చెర్రీ.. నెట్టింట్లో వైరల్‌ ఫొటో..
Ram Charan
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2022 | 9:15 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan). సినిమాలో అతని నటనకు నార్త్‌ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. కాగా త్వరలోనే ఆచార్య (Acharya) సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు చెర్రీ. దీంతో పాటు సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. RC15 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కొద్ది రోజులుగా పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జరుగుతుంది. చరణ్‌కు సంబంధించి కొన్ని సన్ని వేశాలను కూడా అక్కడ చిత్రీకరించారు. అయితే తాజాగా అక్కడి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చెర్రీ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో అమృత్‌సర్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. ‘శంకర్‌గారి(RC15 సినిమా షూటింగ్‌) అమృత్‌సర్‌ షెడ్యూల్‌ పూర్తి. బ్యాక్‌ టూ ఆచార్య ప్రమోషన్స్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అంటే హైదరాబాద్‌లోకి అడుగుపెట్టగానే ఆచార్య చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మళ్లీ బిజీ కానున్నాడు ఈ మెగా హీరో.

కాగా RC15లో విషయానికొస్తే.. వినయ విధేయరామ తర్వాత మరోసారి ఈ సినిమాలో చెర్రీతో రొమాన్స్ చేయనుంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, జయరాం, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు తమన్‌ బాణీలు అందిస్తున్నారు. కాగా అమృత్‌సర్‌ షెడ్యూల్‌లో భాగంగా దొరికిన ఖాళీ సమయంలో అక్కడి జవాన్లతో సరదాగా గడిపాడు చరణ్‌. వారితో కలిసి కాసేపు ముచ్చటించి, భోజనం చేశాడు. అనంతరం ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకున్నాడు. ఇక తండ్రి చిరంజీవితో కలిసి చెర్రీ నటించిన ఆచార్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Also Read:Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‏ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..