Ram Charan: రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అలాంటి సినిమా చేస్తున్నాడా..?

అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి అలరించారు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Ram Charan: రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అలాంటి సినిమా చేస్తున్నాడా..?
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 28, 2023 | 9:50 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ ను దాటి గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి అలరించారు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నారు చరణ్.

సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు తన తొలి సినిమా ఉప్పెనతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఇప్పుడు చరణ్ తో బుచ్చిబాబు చేసే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా పై ఫిలిం సర్కిల్స్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఓ ప్రముఖ క్రీడాకారుడి బయోపిక్ గా ఈ సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈవార్తలు పై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కానీ ఎవరి బయోపిక్ కాదు కానీ తెలిపింది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తో వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.