Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Buchibabu: డైరెక్టర్ బుచ్చిబాబుకు రామ్ చరణ్ దంపతుల సర్ ప్రైజ్.. ఎంతో ప్రత్యేకమంటూ ఎమోషనల్ పోస్ట్..

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన తెరకెక్కించబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తన నెక్ట్ మూవీ రామ్ చరణ్ తో ఉంటుందని చెప్పడంతో మరింత హైప్ పెరిగింది.

Director Buchibabu: డైరెక్టర్ బుచ్చిబాబుకు రామ్ చరణ్ దంపతుల సర్ ప్రైజ్.. ఎంతో ప్రత్యేకమంటూ ఎమోషనల్ పోస్ట్..
Ram Charan, Upasana, Buchib
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2025 | 12:07 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ పొలిటికల్ డ్రామా థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయింది. ఇందులో కియారా అద్వాని కథానాయికగా నటించగా.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ హైప్ పెంచేసింది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతిని పంపించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ బహుమతి తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇటీవల రామ్ చరణ్ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా పంపించారు. “నా మనస్సులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను”అని రాసి ఉన్న నోట్.. శ్రీరాముడి పాదుకలను కూడా పంపారు. ఈఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈ బహుమతి మీ ప్రేమను తెలియజేస్తుందంటూ రామ్ చరణ్, ఉపాసనలను ట్యాగ్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు సన.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్వేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..