BYD YangWang U8: నీటిలోనూ దూసుకెళ్లే కారు ఇదే.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..!
నీటిలో తేలియాడే కారును ఎప్పుడైనా చూశారా? చూడకపోతే వెంటనే ఈ వీడియో చూడండి.. దీనిలో ఓ కారు ఏకంగా 30 నిమిషాల పాటు అలా నీటిలో మునిగిపోకుండా తేలుతూనే ఉంది. చైనాకు చెందిన బీవైడీ ఈ కారును మార్కెట్ కు పరిచయం చేసింది. ఇది అత్యావసర సమయాల్లో ఆటోమేటిక్ గా ఫ్లోటింగ్ మోడ్ ను యాక్టివేట్ చేసుకుంటుందని, తద్వారా కారులోని వారు సురక్షితంగా ఉంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కారు ఏంటి? అందులోని ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

కార్లు రోడ్డుపై ప్రయాణిస్తాయి. విమానాల్లో గాల్లో ప్రయాణిస్తాయి. పడవలు నీటిలో ప్రయాణిస్తాయి. కొన్ని అత్యాధునిక జెట్స్ గాలిలోనూ, రోడ్డుపై కూడా కొంత దూరం వరకూ ప్రయాణించేవి ఇటీవల కాలంలో చూశాం. కానీ ఒక కారు నీటిలో తేలుతూ ప్రయాణించడం ఎక్కడైనా చూశారా? అయితే మీరు ఈ కింద ఉన్న వీడియో చూడండి.. చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి బీవైడీకి చెందిన ఓ కారు అత్యవసర సమయంలో నీటిలో తేలియాడుతూ ఉండిపోయింది. ఇది ఎక్కడ జరిగింది? నీటిలో పడిపోయిన కారు ఎలా తేలియాడింది? ఆ కారు ఏంటి? ఆ కారుకున్న ప్రత్యేకతలు ఏమిటి? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఏమిటీ వైరల్ వీడియో..
ప్రముఖ చైనా కంపెనీ బీవైడీ నుంచి ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ప్రదర్శించిన యాంగ్ వాంగ్ యూ8 కారు నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయ్యింది. బీవైడ్ యాంగ్ వాంగ్ యూ8 ఎస్‌యూవీ కారు ఏకంగా 30 నిమిషాల పాటు అలా నీటిలో తేలియాడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఆ నీటిలోనే అది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణించగలదని ఆ కంపెనీ చెబుతోంది. అందుకోసం ఈ కారులో “ఎమర్జెన్సీ ఫ్లోటింగ్ మోడ్”ను కలిగి ఉందని వివరించింది. ఇది అత్యవసర సమయంలో ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుందని, తద్వారా కారు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే మునిగిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందని బీవైడీ పేర్కొంది.
चीन की कार कम्पनी BYD ने एक ऐसी कार बनाई है जो आपातकालीन स्थिति में 3km/h की गति से 30 मिनट तक पानी में तैर सकती है। pic.twitter.com/FUPJJPqwZU
— Dr. Sheetal yadav (@Sheetal2242) April 13, 2025
అత్యవసర ఫ్లోటింగ్ మోడ్ ఫీచర్ ఏమిటి?
బీవైడీ యాంగ్ వాంగ్ యూ8 కారులో ఎమర్జెన్సీ ఫ్లోటింగ్ మోడ్ ఫీచర్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు కారు ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అన్ని విండోలను మూసివేస్తుంది. సస్పెన్షన్‌ను పైకి లేపి, దాని చక్రాలను ప్రొపల్షన్ కోసం ఉపయోగించినప్పుడు నీటిలో మునిగిపోకుండా నిరోధిస్తుంది. ఇది 30 నిమిషాల పాటు నీటిలో ఉండి 3 కి.మీ/గం వేగంతో ముందుకు సాగుతుంది. ఇది ఐపీ68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్తో వస్తుంది. ఈ ఫీచర్ పనిచేయడం కోసం ఈ కారులో అధునాతన సెన్సార్‌లను అమర్చారు.
బీవైడీ యాంగ్ వాంగ్ యూ8 ఫీచర్లు..
బీవైడీ యాంగ్ వాంగ్ యూ8 కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 22-స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ పవర్డ్, వెంటిలేటెడ్ సీట్లు, ఇతర సౌకర్య ఫీచర్లు ఉన్నాయి.
బీవైడీ యాంగ్ వాంగ్ యూ8 ఇంజిన్ సామర్థ్యం..
బీవైడీ యాంగ్ వాంగ్ యూ8 బలమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. బీవైడీ చెబుతున్న దాని ప్రకారం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ 1,000 కి.మీ వరకు సీఎల్టీసీ(కాంప్రహెన్సివ్ లాంగ్ ట్రిప్ కెపాబిలిటీ) పరిధిని అందిస్తుంది. ఇంజిన్,మోటారు 1200హెచ్పీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 3.6 సెకన్లలో 0-100 కి.మీ/గం స్ప్రింట్ సమయాన్ని కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన డీసీ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 110 కేడబ్ల్యూ వరకు ఛార్జ్ చేయగలదు. ఈ వాహనం కేవలం 18 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి