Rakul Preet Singh: జిమ్‌లో గాయపడ్డ రకుల్ ప్రీత్ సింగ్.. ఆందోళనలో అభిమానులు
రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అక్టోబరు 5న జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఆమెకు గాయం అయ్యింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 80 కిలోలు బరువు ఎత్తింది. ఆ సమయంలో ఆమె నడుముకు సేఫ్టీ బెల్ట్ ధరించలేదు.దాంతో ఆమె తుంటి భాగానికి గాయం అయ్యిందని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గాయపడింది. రకుల్ కు గాయం అయ్యిందని తెలిసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఆమెకు ఏమైంది ఏంటి.? అంటూ ఆరాలు తీస్తున్నారు. కాగా రకుల్ జిమ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుందని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ బరువును ఎత్తడంతో ఆమె తుంటికి గాయమైందని తెలుస్తోంది. ఈ వార్త విని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అక్టోబరు 5న జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఆమెకు గాయం అయ్యింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 80 కిలోలు బరువు ఎత్తింది. ఆ సమయంలో ఆమె నడుముకు సేఫ్టీ బెల్ట్ ధరించలేదు.దాంతో ఆమె తుంటి భాగానికి గాయం అయ్యిందని తెలుస్తోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ 80 కేజీలు ఎత్తే సమయంలో నొప్పిగా అనిపించినా ఆమె ఆపకుండా వర్కౌట్స్ చేశారట. తుంటి నొప్పులు ఉన్నా వ్యాయామాన్ని కొనసాగించడంతో ఆ నొప్పి ఎక్కువైందని తెలుస్తోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తుంటి నొప్పితో బాధపడుతూ రెండు రోజులు షూటింగ్‌కి కూడా వెళ్లింది. దాంతో నొప్పి మరింత ఎక్కువ అయింది. అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. ఆ రోజు పార్టీలో కూడా పాల్గొంది. అప్పుడు ఆమెకు వెన్నునొప్పి ఎక్కువైంది. అలాగే బీపీ కూడా తగ్గింది. దాంతో విపరీతంగా చెమటలు పట్టడం మొదలయ్యింది.
ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!
వెంటనే డాక్టర్‌ని సంప్రదించగా పెద్ద సమస్య ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు తుంటి నొప్పి సమస్య చాలా తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రకుల్ వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె నుంచి ఎలాంటి హెల్త్ అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె బెడ్ పై పడుకొని ఓ వీడియోను షేర్ చేసింది. ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియో పంచుకుంది రకుల్.
ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.