Raju Weds Rambai: నక్సలైట్ ఫ్యామిలీలో పుట్టి.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్‌ రాజ్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా నటించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Raju Weds Rambai: నక్సలైట్ ఫ్యామిలీలో పుట్టి.. రాజు వెడ్స్ రాంబాయి మూవీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Raju Weds Rambai Movie Director

Updated on: Nov 26, 2025 | 7:45 PM

చిన్న సినిమాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సంచలన విజయం సాధించింది. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ అందరూ కొత్త వారైనా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.10 కోట్ల కలెక్షన్లకు చేరువైందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే లాభాల బాటలోకి అడుగు పెట్టిందని చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో అఖిల్ రాజ్- హీరోయిన్ తేజస్విని జంటగా నటించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు సాయిలు. కొత్త డైరెక్టర్ అయినా తన టేకింగ్, మేకింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోన్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్స్, ఇతర ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.  ఈ సందర్భంగా మాట్లాడితన డైరెక్టర్ సాయిలు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ రాజు వెడ్స్ రాంబాయి.. 2004వ సంవత్సరంలో నిజంగా జరిగిన కథ ఇది అప్పటికి మేము ఇకా చాలా చిన్న పిల్లలం. అప్పట్లో ఈ కథ సంచలనం. ఈ కథను మా నాన్న వాళ్లు ఎక్కువగా వినేవాళ్లు. మా పెదనాన్న నక్సలైట్. అప్పట్లో నేను పెద్దగా దానిని పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులు తర్వాత ఇది నన్ను అలా వెంటాడుతూ వచ్చింది. ఈ వెలుగులోకి రాని కథను చెప్పడానికి ఈ డోలముఖి ఫిలిమ్స్ బ్యానర్ క్రియేట్ అయింది’ అని చెప్పుకొచ్చాడు సాయిలు కంపాటి. మొత్తానికి సాయిలు ఇటువంటి విశిష్టమైన కథను ఎంచుకోవడానికి కారణం తనకి ఒక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉండటమేని ప్రధానంగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ పెదనాన్న నక్సలైట్ చెప్పొచ్చో లేదో అని డౌట్ గా చెప్పాడీ సెన్సేషనల్ డైరెక్టర్. అలాగే సినిమాలో విలన్ గా నటించిన  వెంకన్న గురించి అడగ్గా.. అతను కొన్ని రోజుల తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్పుకొచ్చాడు సాయిలు..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి