Vettaiyan: బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా రచ్చ.. ‘వేట్టయన్’కు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

|

Oct 11, 2024 | 3:58 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్ (ది హంటర్). జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు

Vettaiyan: బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా రచ్చ.. వేట్టయన్కు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vettaiyan Movie
Follow us on

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్ (ది హంటర్). జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. దసరా కానుకగా గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన వేట్టయన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రజనీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మరి వేట్టయన్ సినిమా తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో వివరాలిలా ఉన్నాయి. వేట్టయన్’ చిత్రానికి తొలిరోజు భారీగానే వసూళ్లు వచ్చాయి. గురువారం ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. ఇక తెలుగులో అయితే దాదాపు రూ.3 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘వెట్టయన్’ చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిశారు. అయితే అమితాబ్ నటించినా బాలీవుడ్ లో ఈ మూవీపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో వేట్టయన్ కు సాధారణ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

అయితే ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దసరాతో పాటు వీకెండ్ కలిసొచ్చింది కాబట్టి రజనీ కాంత్ సినిమా వసూళ్లు మరింత పెరగవచ్చని సమాచారం. కాగా చాలా ఏళ్ల తర్వాత అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ ‘వెట్టయాన్‌’ సినిమాతో మళ్లీ కలిశారు. కాగా వేట్టయన్ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. సినిమాలో బీజీఎమ్ అదిరిపోయిందని రివ్యూలు వస్తున్నాయి. ఇక రిలీజ్ కు ముందే మనసిలాయో పాట సెన్సేషన్ అయ్యింది. యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది.

ఇవి కూడా చదవండి

వేట్టయన్ సినిమాలో రజనీకాంత్, మంజూ వారియర్..

ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.