Rajinikanth: రజనీకాంత్‌ హెల్త్ అప్డేట్.. సూపర్ స్టార్‌కు ఎలక్టీవ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్..

కడుపు నొప్పి కారణంగా సూపర్ స్టార్ ను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. సూపర్‌స్టార్‌ ఆసుపత్రిలో చేరారు అని వార్త  తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించేందుకు అభిమానులు పెద్దఎత్తున హాస్పటల్ కు తరలివస్తున్నారు. 

Rajinikanth: రజనీకాంత్‌ హెల్త్ అప్డేట్.. సూపర్ స్టార్‌కు ఎలక్టీవ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్..
Supar Star Rajinikanth
Follow us

|

Updated on: Oct 01, 2024 | 6:20 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే . 73 ఏళ్ల రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కడుపు నొప్పి కారణంగా సూపర్ స్టార్ ను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. సూపర్‌స్టార్‌ ఆసుపత్రిలో చేరారు అని వార్త  తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించేందుకు అభిమానులు పెద్దఎత్తున హాస్పటల్ కు తరలివస్తున్నారు. రజినీకాంత్ కొన్నాళ్ల క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన కడుపులో నొప్పితో హాస్పటల్‌లో చేరడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

తాజాగా రజినీకాంత్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. రజనీకాంత్‌కు రక్త నాళాల్లో ఇబ్బందులున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.  అలాగే రజనీకాంత్‌కు ఎలక్టీవ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

రజినీ కాంత్ కు అస్వస్థత అని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు.కాగా జై భీమ్ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

Rajinikanth

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.