Rajini Kanth: బాక్సాఫీస్ దగ్గర జైలర్ ఊచకోత.. కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా తలైవా..
ఐదారేళ్లుగా విజయ్ సినిమాలు ఈజీగా 300 కోట్లు క్రాస్ చేస్తున్నాయి. నెగిటివ్ టాక్‌తోనూ 200 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నారీయన. అదే సమయంలో రజినీ సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే చాలా ఏళ్ళ తర్వాత రజినీ కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్‌తో అసలు స్టామినా తెలుస్తుంది. రజినీ సినిమా హిట్టైతే.. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది జైలర్. రెండ్రోజుల్లోనే 144 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.
ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు రజినీకాంత్. చాలా ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ ఫామ్‌లోకి రావడంతో.. తమిళనాట నెంబర్ గేమ్ మొదలైంది. రేసులో ముందున్న విజయ్‌తో మే ఐ కమ్ ఇన్ అంటూ జాయిన్ అయిపోయారు రజినీ. మరి ఈ నెంబర్ గేమ్ ఎలా ఉండబోతుంది..? రజినీ ఫామ్ విజయ్‌ను ఇబ్బంది పెట్టబోతుందా..? చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ రజినీకాంత్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తుంది. ఫస్ట్ డే నుంచే జైలర్ దుమ్ము దులిపేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా అన్నిచోట్లా ఒకటే పదం.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అని. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే రజినీ హిట్‌తో విజయ్‌కు టెస్టింగ్ టైమ్ మొదలైందిప్పుడు. కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో అన్ అఫీషియల్ నెంబర్ వన్‌గా ఉన్నారు విజయ్.
ఐదారేళ్లుగా విజయ్ సినిమాలు ఈజీగా 300 కోట్లు క్రాస్ చేస్తున్నాయి. నెగిటివ్ టాక్‌తోనూ 200 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నారీయన. అదే సమయంలో రజినీ సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే చాలా ఏళ్ళ తర్వాత రజినీ కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్‌తో అసలు స్టామినా తెలుస్తుంది. రజినీ సినిమా హిట్టైతే.. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది జైలర్. రెండ్రోజుల్లోనే 144 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.
నెల్సన్ దిలీప్ కుమార్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
రజినీ ఫామ్‌లోకి రావడంతో రేస్ ఆసక్తికరంగా మారింది. లియోతో జైలర్‌ను మించే హిట్ కొట్టాలి విజయ్.. లేదంటే చాలా ఈజీగా దళపతిని సూపర్ స్టార్ క్రాస్ చేస్తారు. అయినా రజినీ ఫామ్‌లోకి వచ్చాక నెంబర్ గేమ్‌లుండవు.. నెం 1 ఒక్కడే ఉంటాడు.. అది మా తలైవా అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి చూడాలిక.. తమిళనాట టాప్ చైర్ కోసం రేస్ ఎలా మారబోతుందో..?
నెల్సన్ దిలీప్ కుమార్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
నెల్సన్ దిలీప్ కుమార్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.