Tollywood : హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు..

టికెట్‌ రేట్ల పెంపు కోసం రాజాసాబ్‌, మన శంకరవరప్రసాద్ గారు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది. బుధవారం విచారణ జరగనుండడంతో టికెట్‌ రేట్ల పెంపు ఉంటుందా?.. లేదా?.. అనేది ఉత్కంఠ రేపుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన తమ చిత్రాల టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాయి. ఈ క్రమంలోనే రెండు సినిమాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Tollywood : హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు..
Raja Saab, Mana Shankara Va

Updated on: Jan 07, 2026 | 6:51 AM

తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా ఈ రెండు భారీ చిత్రాలు విడుదల కానుండగా.. నిర్మాతలు హైకోర్టుకు అప్పీలు చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రత్యేక షోలకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను నిర్మాతలు కోరారు. అయితే.. టిక్కెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని అప్పీల్లో కోరారు. టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

ఈ విజ్ఞప్తిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని నిర్మాతల తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో.. ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక.. జనవరి 9న ప్రభాస్ ‘రాజాసాబ్, 12న మన శంకరవరప్రసాద్ గారు.. ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..

ఇదెలా ఉంటే.. ది రాజాసాబ్ సినిమా యూనిట్ ఇప్పటికే టికెట్ ధరల పెంపు విషయమై హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ కు ఒకరోజు ముందుగానే అంటే జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్ లను ఏర్పాటు చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్ లలో రూ.800.. మల్టీప్లెక్స్ లలో రూ.1000 పన్నులతో కలిపి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. జనవరి 9 నుంచి 11 వరకూ సింగిల్ స్క్రీన్ లో రూ.105 పనులతో కలిసి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ విషయంపై ఈరోజు విచారణ జరగనుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..