రొమాంటిక్ పోస్టర్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో .. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాజ్ తరుణ్ `పవర్ ప్లే`..
యంగ్ హీరో రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి
Power Play : యంగ్ హీరో రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ రొమాంటిక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “నేను విజయ్‌గారు కలిసి సరికొత్త జోనర్‌లో చేస్తోన్న డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. కమర్షియల్‌గా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది“ అన్నారు. చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ – “ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. డెఫినెట్‌గా అందర్నీ థ్రిల్ చేస్తుంది“అన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుదలచేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bigg Boss : సరికొత్త చర్చ లేపిన బిగ్ బాస్ షో… సూసైడల్ టెండన్సీకి కారణమవుతుందంటూ ఆరోపణలు..