Bigg Boss : సరికొత్త చర్చ లేపిన బిగ్ బాస్ షో… సూసైడల్‌ టెండన్సీకి కారణమవుతుందంటూ ఆరోపణలు..

బాలీవుడ్ బిగ్‌ బాస్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఫినాలే దగ్గర పడుతుండటంతో టైటిల్‌ కోసం పోటీ పడుతున్న హౌస్‌మెట్స్ సర్వ శక్తులతో పోరాడుతున్నారు...

Bigg Boss : సరికొత్త చర్చ లేపిన బిగ్ బాస్ షో... సూసైడల్‌ టెండన్సీకి కారణమవుతుందంటూ ఆరోపణలు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 15, 2021 | 3:24 AM

Bigg Boss : బాలీవుడ్ బిగ్‌ బాస్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఫినాలే దగ్గర పడుతుండటంతో టైటిల్‌ కోసం పోటీ పడుతున్న హౌస్‌మెట్స్ సర్వ శక్తులతో పోరాడుతున్నారు. అయితే ఈ టైంలో బిగ్ బాస్‌ గురించి సరికొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌… కేరాఫ్ కాంట్రవర్సీగా మారిపోయింది. అబ్యూసివ్‌ లాంగ్వేజ్‌… మితిమీరిన గ్లామర్‌… ఎక్స్‌ట్రీమ్‌ రియాక్షన్స్‌ పై గట్టిగా చర్చ జరుగుతోంది. హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్‌ కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న టాక్ వినిపిస్తోంది.

నెలల తరబడి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఒకే చోట ఉండటంతో హౌస్‌ మేట్స్ మెంటల్‌ కండిషన్‌ డిస్ట్రబ్‌ అవుతుందంటున్నారు కొందరు డాక్టర్స్‌. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీకి కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల మీద కూడా బిగ్ బాస్‌ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నది మానసిక నిపుణుల మాట. షోలో చూపిస్తున్న కంటెంట్‌ మూలంగా అబ్యూసివ్‌ లాంగ్వేజ్‌కు ఆడియన్స్‌ అలవాటు పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే రిలేషన్‌ఫిప్స్ కూడా పక్కదారి పట్టే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఈ ప్రభావం సౌత్‌లో మాత్రం కాస్త తక్కువగానే ఉందన్నది టెలివిజన్‌ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఈ రిపోర్ట్స్ తరువాతైనా… బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కంటెంట్‌ను కంట్రోల్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మా మధ్య కూడా గొడవలు జరుగుతాయి.. ఆ వాలంటైన్స్‌ డేను నేను ఎప్పటికీ మర్చిపోనంటున్న కొణిదెల వారి కోడలు