Raghuvaran: కొడుకునే తల్చుకునేవాడు.. అన్నయ్య మరణానికి అదే కారణం.. రఘువరన్‌ మృతిపై నోరు విప్పిన సోదరుడు

|

Aug 09, 2023 | 6:25 AM

రఘువరన్‌.. తనదైన నటనతో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దిగ్గజ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగార్జున శివ సినిమాలో భవానీ.. బాషా సినిమాలో ఆంటోనీ.. సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌ తండ్రిగా ఈ మూడు పాత్రలే చెబుతాయి ఆయన నటనలో ఉన్న దమ్ము ఏపాటిదో. విలన్‌గా, తండ్రిగా, కామెడీ యాక్టర్‌.. ఇలా ఏ పాత్రకైనా ప్రాణం పోసే అతి తక్కువ మంది నటుల్లో రఘువరన్‌ ఒకరు. ముఖ్యంగా ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు.

Raghuvaran: కొడుకునే తల్చుకునేవాడు.. అన్నయ్య మరణానికి అదే కారణం.. రఘువరన్‌ మృతిపై నోరు విప్పిన సోదరుడు
Raghuvaran Family
Follow us on

రఘువరన్‌.. తనదైన నటనతో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దిగ్గజ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగార్జున శివ సినిమాలో భవానీ.. బాషా సినిమాలో ఆంటోనీ.. సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌ తండ్రిగా ఈ మూడు పాత్రలే చెబుతాయి ఆయన నటనలో ఉన్న దమ్ము ఏపాటిదో. విలన్‌గా, తండ్రిగా, కామెడీ యాక్టర్‌.. ఇలా ఏ పాత్రకైనా ప్రాణం పోసే అతి తక్కువ మంది నటుల్లో రఘువరన్‌ ఒకరు. ముఖ్యంగా ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాలు చేశారు రఘువరన్‌. తన నటన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందారు. ఇక పర్సనల్‌ లైఫ్‌ విషయానికొస్తే.. ప్రముఖ నటి రోహిణీని 1996లో వివాహం చేసుకున్నారు రఘువరన్‌. వీరికి 2000లో వరుణ్‌ రిషి అనే బాబు జన్మించాడు. అయితే కొన్ని కారణాలతో 2004లో విడాకులు తీసుకున్నారు రోహిణీ- రఘువరన్‌. ఇదే సమయంలో మద్యపానానికి అలవాటుపడ్డారీ వర్సటైల్‌ యాక్టర్‌. ఈ కారణంగానే పలు అనారోగ్య సమస్యలతో 2008 మార్చి 19న కన్నుమూశారు. చనిపోయినా ఆయన సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు రఘువరన్‌. ఇదిలా ఉంటే రఘువరన్‌ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఆయన సోదరుడు రమేష్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన రఘువరన్‌- రోహిణీల బంధం, విడాకులు, అన్నయ్య మరణానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు.

‘ విడాకులు తీసుకున్నాక కోర్టు పర్మిషన్‌తో ప్రతి శనివారం తన కొడుకు దగ్గరకు అన్నయ్య (రఘువరన్‌) వెళ్లేవారు. అప్పుడు ‘నాన్నా.. నాన్నా’ అని కుమారుడు వచ్చేవాడు. ఆ సమయంలో కొడుకు మీద ప్రేమను బయటకు చూపిస్తేనే లోలోపల మాత్రం ఎంతో బాధపడేవాడు. నాన్న అని పిలుపు శనివారం మాత్రమే ఉంటుందని చాలా కాలం పాటు మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఆదివారం రాగానే బాబుని రోహిణీ వాళ్లు తీసుకెళ్లేవాళ్లు. బాబు అలా వెళ్లిపోయాక అన్నయ్య కొడుకునే తలుచుకుంటూ విపరీతంగా మద్యం తాగే వాడు. ఈక్రమంలోనే అన్నయ్యకి విపరీతమైన నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే అన్నయ్య చనిపోయాడు’ అని అప్పటి చేదు జ్ఞాపకాలను పంచుకుని ఎమోషనల్‌ అయ్యారు రమేష్‌.

 

ఇవి కూడా చదవండి

Raghuvaran Family

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..