Raghava Lawrence: రుద్రుడుగా మారిన మల్టీటాలెంటెడ్ రాఘవ లారెన్స్.. యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్టుకొట్టేనా..?

కొరియోగ్రాఫర్ గా నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థాయిని క్రియేట్ చేసుకున్నారు రాఘవ లారెన్స్. లారెన్స్ హారర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయారు. ముని సినిమా నుంచి మొదలు పెట్టి కాంచన 3వరకు హారర్ సినిమాలను డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

Raghava Lawrence: రుద్రుడుగా మారిన మల్టీటాలెంటెడ్ రాఘవ లారెన్స్.. యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్టుకొట్టేనా..?
Raghava Lawrence
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2022 | 2:42 PM

కొరియోగ్రాఫర్‌గా నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థాయిని క్రియేట్ చేసుకున్నారు రాఘవ లారెన్స్(Raghava Lawrence). లారెన్స్ హారర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయారు. ముని సినిమా నుంచి మొదలు పెట్టి కాంచన 3 వరకు హారర్ సినిమాలను డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే శివ లింగ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు లారెన్స్. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘రుద్రుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా  ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుందని అర్ధమవుతోంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.   తొంభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రుద్రుడు’ 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.

Rudrudu

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి