Chandramukhi 2 Twitter Review: సినిమా చూస్తే నిద్ర కూడా పోలేరట.. చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ

చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. నేడు చందముఖి 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా రాఘవలారెన్స్ నటించారు. అలాగే చంద్రముఖిగా బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్ నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Chandramukhi 2 Twitter Review: సినిమా చూస్తే నిద్ర కూడా పోలేరట.. చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ
Chandramukhi 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 8:25 AM

దాదాపు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమా ను సీక్వెల్ తెరకెక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్ర ముఖి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చంద్రముఖిగా జోతికా అద్భుతంగా నటించి అందరిని భయపెట్టింది. చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. నేడు చందముఖి 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా రాఘవలారెన్స్ నటించారు. అలాగే చంద్రముఖిగా బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్ నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది.? మరి ఈ చంద్రముఖి ప్రేక్షకులను భయపెట్టిందా అన్నది ఇప్పుడు చూద్దాం.!

చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పీ వాసునే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా పై మంచి విజయం సాదిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో తన పాత్ర దర్శకుడూ వాసు చక్కగా తెరకెక్కించారని పలు ఇంటర్వ్యూలో తెలిపారు కంగనా రనౌత్. అలాగే గత చంద్రముఖి సినిమాతో ఈ సినిమాను పోల్చొద్దు అని కూడా తెలిపింది కంగనా.

అలాగే ఇక ఈ సినిమా ప్రీమియర్స్ మొదలు కావడంతో ఈ సినిమా రివ్యూ ఇస్తున్నారు నెటిజన్ ..

చంద్రముఖి  సినిమా చూస్తే కొన్నిరోజులా పాటు నిద్ర పట్టదు అని అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. అంతలా సినిమా భయపెట్టింది అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. చంద్రముఖి 2 సినిమా చూశాను.. చాలా చక్కగా తెరకెక్కించారు. భయపెట్టే సన్నివేశాలు నాకు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు అని రాసుకొచ్చారు కీరవాణి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.