Raghava lawrence : మనసు బంగారం.. దివ్యాంగురాలి జీవితాన్ని మార్చేసిన లారెన్స్.. ఏం చేశారంటే..

xవెండితెరపైనే కాదు.. రియాల్ లైఫ్ లోనూ హీరో రాఘవ లారెన్స్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.. నిజ జీవితంలో ఎంతో మందికి సాయం చేశారు. సామాజిక సేవలతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాజాగా ఓ దివ్యాంగురాలి జీవితాన్ని మార్చేశారు. ఇంతకీ ఏం చేశారో తెలుసా..

Raghava lawrence : మనసు బంగారం.. దివ్యాంగురాలి జీవితాన్ని మార్చేసిన లారెన్స్.. ఏం చేశారంటే..
Raghava Lawrence

Updated on: Sep 08, 2025 | 8:14 AM

రాఘవ లారెన్స్.. తెలుగు, తమిళ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా అనేక చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవలతో నిజ జీవితంలోనూ హీరోగా మారారు. పేద ప్రజలకు, విద్యార్థులకు, అనాథలకు దైవంగా మారారు. ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు లారెన్స్. తాజాగా శ్వేత అనే దివ్యాంగురాలి లైఫ్ మార్చేశారు. ఆమెకు లారెన్స్ చేసిన సాయం పట్ల నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. కటికి పేదరికంలో ఉన్న శ్వేత అనే యువతి అస్సలు నడవలేదు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా ఆమె మంచానికే పరిమితమైపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న లారెన్స్ ఆమెకు అండగా నిలబడ్డారు.

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల క్రితం ఆమెకు ఓ స్కూటీ బహుమతిగా అందించారు. అలాగే ఆమె నడిచేందుకు సపోర్ట్ గా కృత్రిమ కాలును ఏర్పాటు చేయించారు. అయితే అంత చేసినా శ్వేతకు మరింత సాయం అందించాలనుకున్నారు లారెన్స్. దీంతో గుడిసెలో జీవిస్తున్న ఆమెకు సొంతిల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

కష్టాల్లో ఉన్నవారికి లారెన్స్ సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఎంతో మందికి అండగా నిలబడ్డారు. సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తులను సామాజికసేవలకు ఉపయోగిస్తుంటారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తుంటారు. అనేక మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తూ చదువు కొనసాగించేందుక తోడ్పడుతున్నారు. రైతులకు ట్రాక్టర్స్ కొనిచ్చి అండగా ఉంటారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..