Raghava Lawrence: కారణం ఏదైనా అలా చేయడం తప్పు.. క్షమాపణ చెప్పిన లారెన్స్..

ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా రాబోతుంది ఈ సినిమా. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్.

Raghava Lawrence: కారణం ఏదైనా అలా చేయడం తప్పు.. క్షమాపణ చెప్పిన లారెన్స్..
Raghava Lawrence
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 28, 2023 | 6:46 AM

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రాఘవ లారెన్స్. సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లారెన్స్.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. కాంచన, కాంచన 2 వంటి చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయ్యారు రాఘవ. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా రాబోతుంది ఈ సినిమా. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే అక్కడ ఓ స్టూడెంట్‏కు, బౌన్సర్స్ కు మధ్య గొడవ జరగ్గా.. తాజాగా లారెన్స్ క్షమాపణ తెలిపారు.

చంద్రముఖి 2 ఆడియో లాంచ్ వేడుకలో ఓ స్టూడెంట్, బౌన్సర్ కు మధ్య గొడవ జరిగిందని ఇప్పుడే నాకు తెలిసింది. వేడుక జరుగుతున్న సమయంలో బయట వారి మధ్య గొడవ జరగడంతో నాకు తెలియలేదు. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. విద్యార్థులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. విద్యార్థుల పట్ల నేను ఎలా వ్యవహరిస్తానో మీ అందరికీ తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవ్. కారణం ఏదైనా సరే అలా స్టూడెంట్ ను కొట్టడం చాలా తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.

లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చంద్రముఖి 2 చిత్రంలో లక్ష్మీ మీనన్, రాధికా శరత్ కుమార్, వడివేలు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రముఖి 2 ఆడియో లాంచ్ వేడుక చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.