Raashii Khanna: ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని ముందే తెలుసు.. ‘ఉస్తాద్’ రిలీజ్ వేళ రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది రాశీ ఖన్నా. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె ఇటీవల రిలీజైన ఓ తెలుగు సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమా రిజల్ట్ ను తాను ముందే ఊహించానంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Raashii Khanna: ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని ముందే తెలుసు.. ఉస్తాద్ రిలీజ్ వేళ రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్
Raashii Khanna

Updated on: Mar 14, 2026 | 4:48 PM

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే అందం, అభినయంగా తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది. దీని తర్వాత జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే.. ఇలా చాలా సినిమాలు చేసిందీ అందాల తార. తెలుగుతో పాటు హిందీ, తమిళం సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. చివరగా తెలుగులో తెలుసు కదా అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది రాశీ ఖన్నా. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన చివరి సినిమా తెలుసు కదా సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది రాశీ ఖ్నా.

‘ తెతెలుసు కదా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో నాకు అర్థమైపోయింది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్‌ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్‌ కాదనిపిస్తుందన్నాను. కానీ, నీరజ కోన (డైరెక్టర్) విజన్ మీద నమ్మకంతో అలాగే ముందుకు వెళ్లాం. క్లైమాక్స్‌ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, ఇదేదో తేడా కొడుతోందని నాకు అనిపించింది. అందుకే ఆపరేషన్‌ సీన్‌ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్‌ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్‌ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తెలుసు కదా సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించాడు. శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్, రాశీ ఖన్నా..

రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us