‘పుష్ప’ బ‌డ్జెట్ లెక్క‌ల‌పై రివ్యూ..!

అల వైకుంఠ‌పురం'లో మూవీ బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క‌లెక్ష‌న్లు అదిరిపోయాయి. ఆ జోష్ లోనే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'పుష్ప' సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బ‌న్నీ.

'పుష్ప' బ‌డ్జెట్ లెక్క‌ల‌పై రివ్యూ..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2020 | 10:29 PM

‘అల వైకుంఠ‌పురం’లో మూవీ బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క‌లెక్ష‌న్లు అదిరిపోయాయి. ఆ జోష్ లోనే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘పుష్ప’ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బ‌న్నీ. క్రేజీ కాంబినేష‌న్, గతంలో హిట్ ఇచ్చిన ఇంపాక్ట్, బ‌న్నీ మార్కెట్ అన్నీ లెక్క‌లో వేసుకుని ఈ సినిమాకు భారీ బ‌డ్జెట్ తో నిర్మించాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా లెక్క‌లు పూర్తిగా మారిపోయాయి.

మున‌ప‌టి ప్లానింగ్ ప్ర‌కారం సినిమా తీస్తే ఇప్పుడు వ‌ర్క‌వుట్ అవ్వ‌దు కాబ‌ట్టి..తిరిగి బ‌డ్జెట్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎక్క‌డెక్క‌డ కాస్ట్ క‌టింగ్ చేయెచ్చు అని న‌యా షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ మొద‌లెట్ట‌క‌పోవ‌డం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశం.