త్రివిక్రమ్‌తో మూవీ : రేసులో బాబాయి-అబ్బాయి..!
ఈ ఏడాది పొంగల్ కు రిలీజైన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే జోరులో తన నెక్ట్స్ మూవీ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ ఏడాది పొంగల్ కు రిలీజైన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే జోరులో తన నెక్ట్స్ మూవీ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో తారక్ బిజీగా ఉన్నందున.. ఆ చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది మూవీ యూనిట్. కానీ, అనుకోకుండా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ప్లానింగ్స్ అన్నీ మారిపోయాయి. ఈ క్రమంలో తారక్-త్రివిక్రమ్‌ల కొత్త మూవీ కాస్త లేటుగా స్టార్ట్ అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్‌తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా తెరకెక్కించనున్నాడనే విషయమై సినీ పరిశ్రమలో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గురూజీ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం తారక్ మూవీ తర్వాత త్రివిక్రమ్ చెర్రీని డైరెక్ట్ చేస్తాడని చర్చ జరుగుతోంది. కానీ, తన తదుపరి సినిమా కోసం పవన్ కల్యాణ్ ఇప్పటికే హారికా, హాసినీ నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్తోనే త్రివిక్రమ్ తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.