సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్.. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ హెల్త్‌బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. శ్రీతేజ్‌కు ఇంతవరకూ ఉన్న ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్‌ను డాక్టర్లు తొలగించారు. శ్రీతేజ్‌కు జ్వరం తగ్గుముఖం పడుతోందని.. తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు వివరించారు. అయితే ప్రస్తుతం పైపు ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ ఫిల్మ్ చాంబర్. ఈ మేరకు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అందించాలని భావిస్తున్నారు. బాలుడు శ్రీతేజ్ కోసం సభ్యులు ముందుకురావాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ పిలుపునిచ్చింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మాత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇళ్ల పై దాడులు చేయకూడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు..
డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
Mythri Movie makers donates Rs 50 lakhs to the family of the Sandhya Theater victim family pic.twitter.com/FBQlngM65V
— Teju PRO (@Teju_PRO) December 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.