Pushpa 2: ఇది సార్ బన్నీ రేంజ్.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు.!!

Pushpa 2 Ticket Booking: అల్లు అర్జున్, రష్మిక మందన్నల 'పుష్ప: ది రూల్' విడుదలకు ముందే రికార్డుల సునామీ స్పష్టిస్తుందిఈ చిత్రానికి టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో, పేటీఎమ్‌లలో అభిమానుల నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది.

Pushpa 2: ఇది సార్ బన్నీ రేంజ్.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు.!!
అల్లు అర్జున్‌, రష్మిక జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్‌ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది. 3. 20 నిమిషాల 38 సెకన్లు నిడివి ఉన్నట్టు సమాచారం.
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 27, 2024 | 6:56 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం రీలీజ్ ముందే రికార్డులు స్పష్టిస్తుంది. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ముందే డజన్ల కొద్దీ రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బుక్ మై షో, పేటీఎంలో కూడా రికార్డు స్పష్టించింది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ ఏడాది బిగ్గెస్ట్ పిక్చర్‌గా నిలవడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నది క్లియర్‌గా అర్థమవుతుంది.

‘పుష్ప: ది రూల్’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ చిత్రానికి బుక్ మై షో, పేటీఎమ్‌లలో వస్తున్న స్పందనపై మూవీ యూనిట్ పోస్ట్‌ను షేర్ చేసింది. నిజానికి ‘పుష్ప: ది రూల్’ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ప్రేక్షకులు ఈ మూవీ చూడటానికి ఇప్పటికే తహతహలాడుతున్నారు. నవంబర్ 29 నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది.

‘పుష్ప: ది రూల్’కి భారీ రెస్పాన్స్

“అతిపెద్ద భారతీయ చిత్రం.. ప్రేక్షకులు అత్యంత ఎదురుచూసిన చిత్రం కూడా.. ‘పుష్ప: ది రూల్’ బుక్ మై షోలో ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌ను, Paytmలో 1.3 మిలియన్లకు పైగా ఇంట్రెస్ట్‌ని పొందింది”  అని మేకర్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Pushpa (@pushpamovie)

కొచ్చిలో గ్రాండ్ ఈవెంట్

కేరళలోని కొచ్చిలో ఈరోజు పుష్ప 2 గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. సినిమా స్టార్‌కాస్ట్, మేకర్స్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అంతకుముందు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇటీవల, ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఈవెంట్‌ను కూడా చెన్నైలో ఏర్పాటు చేశారు, అక్కడ దాని ఐటెమ్ నంబర్ కిస్సిక్ విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కింది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..