Ram Charan: జెట్ స్పీడ్‌లో గ్లోబల్ స్టార్.. బుచ్చిబాబు తర్వాత ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా

సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.

Ram Charan: జెట్ స్పీడ్‌లో గ్లోబల్ స్టార్.. బుచ్చిబాబు తర్వాత ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 4:27 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కన్నడ దర్శకుడితో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అతను ఎవరో కాదు నర్తన్.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

కన్నడ ఇండస్ట్రీలో నర్తన్ దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా నర్తన్ మాట్లాడుతూ.. ‘నా తదుపరి చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఆ సినిమాలో ప్రధాన పాత్రధారుల ఎంపిక జరుగుతోంది. మా సినిమాకు సూర్య, రామ్ చరణ్ సరిపోతారని అనుకున్నాం. ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు కూడా నటించే అవకాశం ఉంది. అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతానికి నిర్మాణ సంస్థ మాత్రమే ఫైనల్ అయ్యింది అని అన్నాడు. దాంతో నర్తన్ రామ్ చరణ్ తో సినిమా ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..