Aadhar update: ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే

దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అత్యంత అవసరం. ప్రభుత్వ పథకాలు పొందటానికి, వివిధ లావాదేవీలు నిర్వహించడానికి, నిత్యం చేసే అనేక పనులకు అడుగడుగునా అవసరమవుతుంది. పుట్టిన పిల్లల నుంచి ముసలి వారి వరకూ అందరికీ ఈ కార్డును మంజూరు చేస్తారు. అయితే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత చాలామంది దాన్ని అలాగే వదిలేస్తారు. సొంత ఊరిలోనే ఉంటున్నాం, వివరాలు సక్రమంగా ఉన్నాయని కదా అని అనుకుంటారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఆధార్ కార్డును అందరూ అప్ డేట్ చేసుకోవాలి.

Aadhar update: ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే
Follow us
Srinu

|

Updated on: Nov 27, 2024 | 4:00 PM

ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. చిరునామాతో పాటు ఐరిస్, వేలిముద్రలు తదితర బయోమెట్రిక్ సమాచారం దానిలో ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డులో వివరాలన్నీ సక్రమంగా దోషరహితంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం రీత్యా వేరే ప్రాంతాలకు మారిన వారు ఆధార్ కార్డులోని తమ చిరునామాకు తప్పకుండా మార్చుకోవాలి. అలాగే సొంత ఊరిలోనే ఉన్నవాళ్లు, కార్డులో వివరాలన్నీ సక్రమంగా ఉన్నవారు కూడా ప్రతి పదేళ్లకు కార్డును అప్ టేడ్ చేసుకోవాలి.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ మేరకు ఆధార్ కార్డు హోల్డర్లకు ఆదేశాలు జారీ చేసింది. పదేళ్లకు మించి కార్డును అప్ డేట్ చేయనివారు వెంటనే చేసుకోవాలని సూచించింది. వివరాలను ఉచితంగా నవీకరణ చేసుకోవటానికి ఈ ఏడాది డిసెంబర్ 14 వరకూ అవకాశం కల్పించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్టు చేసింది. కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ ఉచిత సేవ మైఆధార్ పోర్టల్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గడువు దాటితే నిర్ణీత చార్జీలతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన పత్రం కావడంతో దాన్ని సమగ్రంగా, తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల నకిలీల బెడద తప్పుతుంది. అందుకోసమే ఉచిత అప్ డేట్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. పదేళ్ల తర్వాత రికార్డులను అప్ డేట్ చేసుకోవడం వల్ల మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడతుంది. ఆధార్ ను ఆన్ లైన్ లో నవీకరణ చేసుకోవడానికి ఈ కింద తెలిపిన సులభ పద్ధతులు పాటించొచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ అప్‌డేట్ ఇలా

  • ముందుగా మైఆధార్ పోర్టల్ కు వెళ్లాలి
  • లాగిన్ బటన్ నొక్కిన తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి.
  • ఓటీపీ సెండ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. మీ నంబర్ కు వచ్చిన నంబర్ ను దానిలో ఎంటర్ చేయాలి.
  • డాక్యుమెంట్ అప్ డేట్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి.
  • అక్కడి తెలిపిన నిబంధనలను పూర్తిగా చదవాలి.
  •  వివరాలు సరి అయినవేనని నేను ధ్రువీకరిస్తున్నాను అనే బాక్స్ లో టిక్ చేసి, నెక్స్స్ బటన్ నొక్కాలి. దానిలో అడిగిన డాక్యుమెంట్లను , చిరుమానా రుజువులను సబ్మిట్ చేయాలి.
  • తర్వాత మీ ఇమెయిల్ కు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) వస్తుంది. దాన్ని ఉపయోగించి మీ ఆధార్ అప్ డేట్ ను తనిఖీ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..