Domestic Air Passenger: పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?

విమాన ప్రయాణం అనేది సామాన్యుడికి కలగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అధిక ధరల దెబ్బకు ఆ ఊసే ఎత్తరు. కానీ మారిన జీవన విధానంలో విమాన ప్రయాణికులు కూడా పెరుగుతున్నారు. ముఖ్యంగా దేశీయ విమాన ప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన పెరుగుదల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Domestic Air Passenger: పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
Flight
Follow us
Srinu

|

Updated on: Nov 26, 2024 | 9:00 PM

భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ గతేడాదితో అక్టోబర్‌తో పోలిస్తే 5.3 శాతం పెరిగింది. 1.36 కోట్లకు చేరుకుందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ నెలవారీ డేటాలో పేర్కొంది. ఈ నెలలో ఇండిగో 86.40 లక్షల మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. అంటే దాదాపు 63.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఎయిర్ ఇండియా, విస్తారా కంపెనీలు వరుసగా 26.48 లక్షలు, 12.43 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లాయి. ఎయిర్ ఇండియా తన అనుబంధ సంస్థ ఏఐఎక్స్ కనెక్టు తన తక్కువ ధర అంతర్జాతీయ బడ్జెట్ విభాగం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్తో ఈ సంవత్సరం అక్టోబర్ 1న విలీనం చేసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టిన విలీన సంస్థ ఇప్పుడు ఎయిర్ ఇండియాకు సంబంధించిన తక్కువ-ధర విభాగంగా పనిచేస్తుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం అక్టోబర్ 2024లో ఎయిర్ ఇండియా (ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్తో సహా) మార్కెట్ వాటా 19.4 శాతంగా ఉండగా, విస్తారా 9.1 శాతంగా ఉంది. విస్తారా, అంతకుముందు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య 51:49 శాతం జాయింట్ వెంచర్ కూడా నవంబర్ 12న ఫుల్ సర్వీస్ క్యారియర్ ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. డేటా ప్రకారం రెండు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ (ఎయిర్ ఇండియా మరియు విస్తారా) కలిసి గత నెలలో మొత్తం దేశీయ ప్రయాణీకుల రద్దీలో 28.5 శాతంగా ఉన్నాయి.

స్పై‌స్‌జెట్ ద్వారా 3.35 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేయగా, ఆకాశ్ ఎయిర్ గత నెలలో 6.16 లక్షల మంది ప్రయాణీకులను రవాణా చేసింది. అక్టోబర్ 2024లో మొత్తం దేశీయ ప్రయాణీకుల రద్దీలో 2.4 శాతం, 5.4 శాతంగా ఉంది డీజీసీఏ డేటాలో పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి గత నెలలో 71.9 శాతం వద్ద అత్యధిక ఆన్- టైమ్ పనితీరును అందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..