Latest scam: సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొత్త విధానాలు, పద్దతులతో ప్రజలను మోసం చేసి లక్షలు దోచుకుంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని, బెదిరింపులకు పాల్పడి మోసాలు చేస్తున్నారు. గతంలో బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్లు చేసి ఓటీపీ నంబర్లు అడిగి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు లాగేవారు. ఈ మోసంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించింది. దీంతో నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పద్దతులను తెర మీదకు తీసుకువస్తున్నారు.

Latest scam: సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ
Follow us
Srinu

|

Updated on: Nov 27, 2024 | 3:45 PM

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల ఓ కొత్త తరహా ఆన్ లైన్ మోసాన్ని బయట పెట్టింది. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను, ప్రజలను హెచ్చరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. చట్టపరమైన నిబంధనల పేరుతో ప్రజలను బెదిరించి, భారీ జరిమానాల రూపంలో డబ్బును కాజేస్తున్నారు. ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాల చెందిన వారినే నేరగాళ్లు టార్గెట్ చేయడం విశేషం.

సైబర్ నేరగాడు ముందుగా తాను ఎంచుకుని వ్యక్తికి ఫోన్ చేస్తాడు. మెసెంజర్ యాప్ లోని వీడియో కాలింగ్ ఫీచర్ ను దీన్ని ఉపయోగిస్తాడు. తాను సీబీఐ లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారినని పరిచయం చేసుకుంటాడు. సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారం నేరగాడి దగ్గర ఉంటుంది. వాటి వివరాలను ప్రస్తావించి మాట్లాడడం మొదలుపెడతాడు. అలాగే ఇటీవల విక్రయించిన ఆస్తి, చెల్లించిన పన్ను వివరాలను ప్రస్తావిస్తాడు. దీంతో ఫోన్ లో మాట్లాడే వ్యక్తిపై నమ్మకం కలుగుతుంది. ఆస్తి వెబ్ సైట్లు, ప్రాపర్టీ బ్రోకర్ల వెబ్ సైట్, రిజిస్ట్రర్ కార్యాలయంలోని డేటాను తస్కరించి తన దగ్గర ఉంచుకుంటాడు. ఆస్తి విక్రయ సమయంలో పన్నును ఎగ్గొట్టారనో, ఆదాయపు పన్నును చెల్లించకుండా మోసం చేశారనో వివరించి, దాన్ని వల్ల అరెస్టు చేసే అవకాశం ఉందని భయపెడతాడు. ఆ నేరానికి జైలు శిక్ష విధిస్తారని, భారీగా జరిమానా కట్టాల్సి ఉందని చెబుతాడు.

జైలు గురించి వినగానే సాధారణంగా భయం కలుగుతుంది. దీంతో అవతలి వారు ఆందోళనకు గురవుతారు. దీన్నే నేరగాడు ఆసరాాగా చేసుకుంటాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని, పరువు పోతుందని హెచ్చరిస్తారు. కొన్ని బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్బాల్లో లంచం అడగరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత డబ్బును వివిధ ఖాతాలకు పంపాలని కోరతాడు. కేసు విచారణ తర్వాత ఆ డబ్బులను తిరిగి వెనక్కి వచ్చేస్తాయని నమ్మిస్తాడు. ఇలాంటి స్కాములను ఫిషింగ్ లేదా సోషల్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. ఇవి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగవు. అలాగే చట్టం పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకూడదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఖతర్నాక్‌ కొడుకు కట్టుకథ..! 'అతడు' మువీలో మహేష్‌ని దించేశాడు సామీ
ఖతర్నాక్‌ కొడుకు కట్టుకథ..! 'అతడు' మువీలో మహేష్‌ని దించేశాడు సామీ
ఓటీటీలో వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
16 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కైవసం.. కట్‌చేస్తే..
16 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కైవసం.. కట్‌చేస్తే..
ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంః శ్రీధర్ బాబు
ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంః శ్రీధర్ బాబు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అందరి చూపు ఆ బుడతడిపైనే
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అందరి చూపు ఆ బుడతడిపైనే
ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న యూపీఐ సేవలు!
ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న యూపీఐ సేవలు!
పేదలకు అన్యాయం జరగకుండా చూస్తాం: శ్రీధర్ బాబు
పేదలకు అన్యాయం జరగకుండా చూస్తాం: శ్రీధర్ బాబు
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్!
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్!
స్టార్ హీరోతో పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే.. పాన్ ఇండియా ఫేమస్
స్టార్ హీరోతో పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే.. పాన్ ఇండియా ఫేమస్
ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్‌.. ఆరో తరగతి బాలుడు ఆత్మహత్యాయత్నం
ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్‌.. ఆరో తరగతి బాలుడు ఆత్మహత్యాయత్నం