Pushpa 2: పుష్ప2 సినిమాకు ప్రకాశ్ రాజ్ రివ్యూ.. అల్లు అర్జున్ గురించి ఏమన్నాడంటే?

|

Dec 06, 2024 | 8:27 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా గురువారం (డిసెంబర్ 05)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఏకంగా రూ. 294 కోట్లు రాబట్టింది.

Pushpa 2: పుష్ప2 సినిమాకు ప్రకాశ్ రాజ్ రివ్యూ.. అల్లు అర్జున్ గురించి ఏమన్నాడంటే?
Prakash Raj, Allu Arjun
Follow us on

‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతుకు ముందు అంటే డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారాన సినిమాకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్ లోనూ పుష్ప 2 దుమ్ము రేపింది. దీంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుని మొదటి రోజే రూ. 294 కోట్లు రాబట్టింది పుష్ప. భారతీయ సినిమా చరిత్రలో ఒక సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. ఇక పుష్ప 2 సినిమా చూసిన వారందరూ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు పుష్ప 2 సినిమాను చూశారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ యాక్టర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పుష్ప 2 సినిమాను వీక్షించారు.అనంతరం ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ‘గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, నీ జర్నీ ఎంతో గొప్పది. నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నీ నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండు’ అని ప్రశంసలు కురిపించాడు. అలాగే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా అభినందనలు తెలిపాడు.

 

ఇవి కూడా చదవండి

 

కాగా అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాల్లో ప్రకాశ్ రాజ్ నటించాడు. బన్నీ మొదటి సినిమా గంగోత్రితో మొదలైన వీరి ప్రయాణం బన్నీ, పరుగు, బద్రీనాథ్, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాల్లోనూ కొనసాగింది.

ప్రకాశ్ రాజ్ ట్వీట్..

ఇక టాలీవుడ్ నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్, యంగ్ హీరోలు శ్రీ విష్ణు, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం తదితరులు పుష్ప 2 సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, రష్మక మందన్నా, శ్రీలీలకు కంగ్రాట్స్ చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..