AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్త్‌కు మాస్ రుచి చూపిస్తోన్న సౌత్ డైరెక్టర్లు.. దెబ్బకు హిట్ బొమ్మ పడ్డట్టే..

సౌత్‌ లో కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్‌ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన సినిమా జాట్‌.

నార్త్‌కు మాస్ రుచి చూపిస్తోన్న సౌత్ డైరెక్టర్లు.. దెబ్బకు హిట్ బొమ్మ పడ్డట్టే..
Jaat
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 7:47 PM

Share

ప్రజెంట్ మన సినిమానే ఇండియన్ బాక్సాఫీస్‌ ను రూల్‌ చేస్తోంది. మన హీరోలు నార్త్ మార్కెట్‌ లో రికార్డ్‌ లు క్రియేట్ చేస్తున్నారు. మన దర్శకులు సౌత్ సినిమాలతోనే నార్త్‌ లో కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్‌ కూడా మన దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలా సౌత్‌ బాట పడుతున్న బాలీవుడ్ స్టార్స్‌ కు మాస్‌ టింజ్‌ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సౌత్ మేకర్స్.

తాజాగా జాట్‌ టీజర్‌ తో మరోసారి సౌత్‌ మాస్‌ కంటెంట్‌ మీద డిస్కషన్ మొదలైంది. సౌత్‌ లో కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్‌ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన సినిమా జాట్‌. గదర్ 2 తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ, ఆ జోరును కంటిన్యూ చేసేందుకు సౌత్‌ ఫ్లేవర్‌ ను నమ్ముకున్నారు. అందుకే సౌత్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న యంగ్ డైరెక్టర్‌ తో మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ తో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు గోపి చంద్‌. సన్నీని అవుట్ అండ్ అవుట్ మాస్‌ యాక్షన్ స్టార్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు.

రీసెంట్‌ టైమ్స్‌ లో బాలీవుడ్ స్టార్‌ హీరోలు కూడా సౌత్ డైరెక్టర్‌ లతో టచ్‌ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నయా ఇన్నింగ్స్‌ లో షారూఖ్‌ ఖాన్‌ను ఊరమాస్ రోల్‌ లో చూపించిన హిట్ కొట్టారు అట్లీ. ఈ డైరెక్టర్‌ టేకింగ్‌ కు ఫిదా అయిన షారూఖ్ అదే కాంబోలో మరో మూవీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అట్లీ శిష్యుడు కలీస్ కూడా బాలీవుడ్‌ కు మాస్ యాక్షన్‌ ను కొత్తగా చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. సౌత్‌ లో సూపర్ హిట్ అయిన తెరి సినిమాను హిందీలో బేబీ జాన్‌ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సౌత్‌ వర్షన్‌ కన్నా ఎక్కువ వయలెంట్‌ గా హీరో క్యారెక్టర్‌ ను డిజైన్ చేశారు కలీస్‌.

బాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్ రణబీర్‌ కపూర్‌ కూడా సౌత్‌ డైరెక్టర్‌ తో కలిసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ లైనప్ చూశాక ఇండియన్ సినిమా కమర్షియల్ లెక్కలు మార్చే సత్తా ఉన్న దర్శకులు సౌత్‌లో మాత్రమే ఉన్నారన్న నిర్ణయానికి వచ్చేశారు నార్త్ స్టార్స్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్