రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ !

‘కేజీఎఫ్’ సినిమాతో ఇండియా వైజ్ పాపులారిటీ సంపాదించాడు కన్నడ హీరో యశ్.  ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ తెరకెక్కిస్తున్నారు. 

రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 17, 2020 | 4:57 PM

‘కేజీఎఫ్’ సినిమాతో ఇండియా వైజ్ పాపులారిటీ సంపాదించాడు కన్నడ హీరో యశ్.  ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ తెరకెక్కిస్తున్నారు.  అందులోనూ యశ్ హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్-2 తర్వాత యశ్ ఎవరితో సినిమా తీస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చాలాంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ లిస్ట్‌లో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోదంటూ టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. (భార్యాభర్తలైనా సరే.. భౌతికదూరం పాటించాల్సిందే…! )

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిట్) పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక మరో పాన్ కథతో యశ్‌తో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నారట. దీనిపై యశ్-పూరీ మధ్య కొంతకాలంగా చర్చలు నడిచినట్టు టాక్. వీరి కలయికలో సినిమా రానుందని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తోంది.