భార్యాభర్తలైనా సరే.. భౌతికదూరం పాటించాల్సిందే…!

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కట్టడి కావడం లేదు సరికదా... మరింతగా వ్యాప్తి చెందుతూ ఉంది.. అందుకే ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.. లండన్‌, టూ టైర్‌, త్రీ టైర్‌ నగరాలలో పాటుగా...

భార్యాభర్తలైనా సరే.. భౌతికదూరం పాటించాల్సిందే...!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 4:30 PM

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కట్టడి కావడం లేదు సరికదా… మరింతగా వ్యాప్తి చెందుతూ ఉంది.. అందుకే ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.. లండన్‌, టూ టైర్‌, త్రీ టైర్‌ నగరాలలో పాటుగా కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొన్ని మార్గదర్శకాలను విధించింది. అక్కడ ఉన్నవారు భార్యాభర్తలైనా సరే భౌతిక దూరం పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.. కుటుంబసభ్యులు కూడా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలలో తెలిపింది.. ఈ నిబంధన ఒకే కప్పు కింద నివసిస్తున్న భార్యభర్తలకు వర్తించదు.. అలాగే ఒకే కప్పు కింద సహజీవనం చేస్తున్న జంటలకు కూడా వర్తించదు.. వారు ఇంటా బయటా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదు.. లైంగిక సంబంధాలు కూడా కొనసాగించవచ్చు. ఎటొచ్చి ఉద్యోగం రిత్యానో, ఇతర కారణాల వల్లనో వేరువేరుగా జీవిస్తున్న భార్యభర్తలు, సహజీవన జంటలు మాత్రం కలుసుకున్నప్పుడు భౌతికదూరాన్ని తప్పరిసరిగా పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.. ఈ నిబంధనే వేరువేరుగా జీవిస్తున్న జంటలకు కోపం తెప్పించింది.. తమను లైంగికంగా కలుసుకోరాదని చెప్పడానికి ప్రభుత్వం ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.. ఇది తమ వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనని మండిపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా నివారించేందుకే ఈ నిబంధన పెట్టామంటూ సర్ది చెప్పుకుంటోంది.