Puri Jagannadh: లైగర్ సినిమాలో అదే హైలైట్.. పూరిజగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Aug 19, 2022 | 5:53 PM

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు

Puri Jagannadh: లైగర్ సినిమాలో అదే హైలైట్.. పూరిజగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Puri Jagannadh
Follow us on

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 25న లైగర్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ఎం ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు లైగర్ టీమ్.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లైగర్ టీమ్ పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన భారీ రెస్పాన్స్ వస్తోంది మూవీ టీమ్ కు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ పూరిజగన్నాథ్. తాజాగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ లైగర్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ లో సినిమా కథ అర్ధం కాలేదని, మరో ట్రైలర్ వస్తుందా..? అని ఛార్మి పూరీని అడిగారు. దానికి పూరి స్పందిస్తూ.. నేను రెండు మూడు ట్రైలర్ లు డిజన్ చేశాను. కానీ నాకే నచ్చలేదు.  ఫైనల్ గా మేము ఈ ట్రైలర్ కు ఫిక్స్ అయ్యాం. అలాగే ఈ సినిమాలో హీరో పాత్రకు నత్తి అందుకే ఎక్కువ డైలాగులు కూడా ట్రైలర్ లో పెట్టలేదు. ట్రైలర్ చూస్తే మీకు సినిమా కథ అర్ధమవుతుంది. కరీంనగర్ కుర్రాడు.. తల్లితో కలిసి ముంబైకు వెళ్లి ఛాయ్ అమ్ముకుంటూ.. ఆ తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు అనేది కథ అని అన్నారు పూరి. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాం.. సినిమాలో క్లైమాక్స్ వన్ ఆఫ్ ది హైలైట్ గా ఉంటుందని అన్నారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి